ఆర్టీసీ విలీన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

By sivanagaprasad Kodati  |  First Published Dec 16, 2019, 6:42 PM IST

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
 


ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అంతకుముందు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి, దానికి సంబంధించిన బిల్లును రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సోమవారం సభలో ప్రవేశపెట్టారు.

Latest Videos

Also Read:చిత్తూరులో హైటెక్ వ్యభిచారం....ఒక్క రాత్రికి రూ.30వేలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఏపీ రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగులను అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయటానికి జగన్ ప్రభుత్వం ప్రజారవాణా శాఖ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశామన్నారు.

ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుందన్న తరుణంలో నాడు వైయస్‌ రాజశేఖర రెడ్డి ఆర్టీసీకి జీవం పోశారని మంత్రి గుర్తుచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తామని జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలోనూ పొందుపరిచారని మంత్రి తెలిపారు. 

1997లో చంద్రబాబు 141997 అనే చట్టాన్ని తెచ్చారు. ప్రభుత్వ అనుబంధ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ఎవ్వరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేయకుండా అడ్డుకోవటానికి ఈ చట్టాన్ని తెచ్చారని నాని గుర్తుచేశారు. 

అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్నవారి రిటైర్మెంట్ పరిమితిని 60 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. జనవరి 1 తారీఖు నుంచి వీళ్లంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణీ అవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Also Read:మంగళగిరిలో టీడీపీ ఆఫీస్‌కు చిక్కులు: హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్

దీనివల్ల ఖజానాపై రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో అదనపు భారం పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు. ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. 
 

click me!