మంగళగిరిలో టీడీపీ ఆఫీస్‌కు చిక్కులు: హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్

By narsimha lode  |  First Published Dec 16, 2019, 12:09 PM IST

మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన విషయమై  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. 


 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వ భూమిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని ఆరోపిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో సోమవారం నాటు పిల్ దాఖలు చేశారు. ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని మంగళగిరిలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి,. ఇటీవలనే  ఈ కార్యాలయ ప్రారంభించారు. 

Latest Videos

అయితే  ఈ కార్యాలయం ప్రభుత్వ భూమిలో నిర్మించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకొంది హైకోర్టు.

ఇటీవలనే టీడీపీ కార్యాలయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల  రామకృష్ణారెడ్డి పిటిషన్ వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ భూమిలోనే టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని, ఈ కార్యాలయాన్ని కూల్చివేయాలని  ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగానే ఆయన సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

మంగళగిరిలోనే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడ నిబంధనలకు విరుద్దంగా నిర్మించిందేనని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.ఈ నిర్మాణాలను కూడ కూల్చివేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ఉపయోగించిన ప్రజా వేదికను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేసింది. చంద్రబాబునాయుడు నివాసాన్ని కూడ కూల్చివేస్తామని కూడ నోటీసులు జారీ చేసింది. అయితే ఇంకా ఈ నివాసాన్ని కూల్చివేయలేదు.

తాజాగా టీడీపీ కార్యాలయంపై కూడ ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో హైకోర్టు  రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, టీడీపీకి నోటీసులు జారీ చేసింది. 
 

click me!