రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్: చేరికలకు తాత్కాలిక బ్రేక్ వేసిన టీడీపీ

By narsimha lode  |  First Published Jan 31, 2024, 6:00 PM IST

వైఎస్ఆర్‌సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొనే విషయమై ఆ పార్టీ  తాత్కాలికంగా బ్రేక్ పడింది.


అమరావతి: వైఎస్ఆర్‌సీపీ నుండి తెలుగు దేశంలో చేరాలనుకుంటున్న  అసంతృప్త ఎమ్మెల్యేల చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. రాజ్యసభ ఎన్నికల తర్వాత ఈ చేరికలు ఉండే అవకాశం ఉంది.రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో  తెలుగు దేశం పార్టీ   చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మూడు రాజ్యసభ స్థానాలకు  ఫిబ్రవరి  27న పోలింగ్ జరగనుంది. అయితే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కు వెలువడక ముందే  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు  స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆయా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు  స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారు. మరోసారి కూడ రెబెల్ ఎమ్మెల్యేలకు ఈ నెల  30న  స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు పంపారు. ఫిబ్రవరి 8వ తేదీన విచారణకు రావాలని కూడ స్పీకర్ నోటీసులిచ్చారు.

Latest Videos

undefined

also read:వేర్వేరు ఘటనలు: సురక్షితంగా బయటపడ్డ బాబు, భువనేశ్వరి

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేల బలం తగ్గించేందుకు వైఎస్ఆర్‌సీపీ ఎత్తుగడలతో ముందుకు వెళ్తుందని  తెలుగు దేశం భావిస్తుంది.ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన  విషయాన్ని ఆ పార్టీ  గుర్తు చేస్తుంది. దీంతో  టిక్కెట్టు దక్కని  వైఎస్ఆర్‌సీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు కొందరు తెలుగు దేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారు.

also read:అటు అన్నా, ఇటు చెల్లి: కడప రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి?

అయితే  కొందరు  ఇప్పటికే  పార్టీలో చేరాలని ముహుర్తం కూడ ఫిక్స్ చేసుకున్నారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు  50 మంది తమతో టచ్ లో ఉన్నారని తెలుగు దేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటే  రాజ్యసభ ఎన్నికల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉందని  తెలుగు దేశం పార్టీ భావిస్తుంది.ఈ క్రమంలోనే  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరికకు తాత్కాలికంగా బ్రేక్ వేసిందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్ధిని బరిలోకి దింపాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.  వర్ల రామయ్య లేదా కోనేరు సురేష్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. 2023లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ  తెలుగు దేశం పార్టీ ఒక్క అభ్యర్ధిని బరిలోకి దింపి విజయం సాధించింది.  గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవంతో  వైఎస్ఆర్‌సీపీ  ముందు జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.   వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.


 

click me!