తెలంగాణా పనులన్నీ ఏపి కాంట్రాక్టర్లకే

First Published Oct 22, 2017, 7:43 AM IST
Highlights
  • గడచిన మూడున్నరేళ్ళుగా తెలంగాణాలో జరుగుతున్న ఇరిగేషన్ కాంట్రాక్టులన్నీ ఏపి కాంట్రాక్టర్లే చేస్తున్నారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు. పాలమూరు-రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టు...
  • ఇలా ఏ వర్క్  తీసుకున్నా పనులు చేయిస్తున్నది మాత్రం ఏపి కాంట్రాక్టర్లే. అందులోనూ మెగా ఇంజనీరింగ్ కంపెనీదే సింహభాగం.

గడచిన మూడున్నరేళ్ళుగా తెలంగాణాలో జరుగుతున్న ఇరిగేషన్ కాంట్రాక్టులన్నీ ఏపి కాంట్రాక్టర్లే చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు. పాలమూరు-రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టు...ఇలా ఏ వర్క్  తీసుకున్నా పనులు చేయిస్తున్నది మాత్రం ఏపి కాంట్రాక్టర్లే. అందులోనూ మెగా ఇంజనీరింగ్ కంపెనీదే సింహభాగం. ఇప్పుడిదంతా ఎందుకంటే, టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కాంట్రాక్టుల ఆరోపణలతో తేనెతుట్టెను కదిపినట్లైంది.

తెలంగాణాలో తాను కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ఏపి టిడిపి నేతలు మాత్రం కెసిఆర్ దగ్గర నుండి కాంట్రాక్టులు ఎలా పొందుతారంటూ పెద్ద బాంబే పేల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతటితో ఆగకుండా ఏపి ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణాలో రూ. 2 వేల కోట్ల కాంట్టాక్టులు తీసుకున్నారని, మరో మంత్రి పరిటాల సునీతతో పాటు ఎంఎల్సీ పయ్యావుల కేశవ్ ఇద్దరూ బీర్ తయారీ కంపెనీకి లైసెన్సులు తీసుకున్నట్లు కూడా చెప్పారు. రేవంత్ బయటపెట్టిన బండారంతో టిడిపిలో ముసలం మొదలైంది.

రేవంత్ ప్రకటన చేసిన దగ్గర నుండి కాంట్రాక్టుల విషయమై పెద్ద చర్చే నడుస్తోంది. అందులోబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.10 లక్షల కోట్లు. ఇందులో అత్యధికం అంటే సుమారు 1.90 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకున్నది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ (మెగా కంపెనీ) కంపెనీయే. దాని యజమాని మెగా కృష్ణారెడ్డి అన్న విషయం అందరకీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాం నుండి ఇప్పటికీ ఇరిగేషన్ కాంట్రాక్టులన్నీ మెగా కాంపెనీయే చేస్తోంది దాదాపు.

ఇక, తెలంగాణా విషయాన్ని తీసుకుంటే, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ పెద్దగా ఏ కాంట్రాక్టు కూడా దక్కలేదు. ఏపి, తెలంగాణాలో ఎవరు పనులు చేసినా మెగా కంపెనీ వద్ద సబ్ కాంట్రాక్టులు తీసుకోవాల్సిందే. సబ్ కాంట్రాక్టులు చేస్తున్నవారిలో రాజంపేట వైసీపీ ఎంపి మిధున్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు కూడా ఉన్నారు. అయితే, కెసిఆర్ తో మాట్లాడుకుని నేరుగా కాంట్రాక్టులు తీసుకున్న టిడిపి నేతల్లో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, సిం రమేష్ ప్రముఖులు.

రేవంత్ ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించంటంతోనే టిడిపిలో ముసలం  పుట్టింది. రేవంత్ మాటలను బట్టి చూస్తే తెలంగాణాలో పనులన్నీ ఏపి కాంట్రాక్టర్లే చేస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది. మరి, ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ళని తిట్టిన తిట్లన్నీ ఏమైపోయాయి? వాటికి కెసిఆరే సమాధానం చెప్పాలి మరి.

click me!