కంట్లో వేసే చుక్కల మందుపై అనుమతి ఇవ్వాలని ఆనందయ్య ఏపీ హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
అమరావతి: కంట్లో వేసే చుక్కల మందుపై అనుమతి ఇవ్వాలని ఆనందయ్య ఏపీ హైకోర్టును కోరారు. ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు మినహా ఆనందయ్య తయారు చేసే మూడు రకాల మందులను పంపిణీ కి మాత్రమే ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.
ఈ మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇచ్చిన అనుమతి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆనందయ్య ఇచ్చే కళ్లలో వేసే మందుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి పరిశోధన రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ రిపోర్టులు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.కంట్లో చుక్కల మందుపై తమకు రెండు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కంట్లో వేసే మందుపై నివేదికను గురువారంలోగా నివేదికను తెప్పిచుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
undefined
also read:ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఏపీలో కర్ఫ్యూ పొడగింపు
కె' అనే కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతించకపోవడానికి శాంపిల్ ఇవ్వకపోవడమే కారణమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే కె అనే మందు శాంపిల్ ఇస్తామని ఆనందయ్య న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. అంతేకాదు వనమూలికల విషయంలో కూడ ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య లాయర్ ప్రభుత్వాన్ని కోరారు.
విచారణను గురువారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. అంతకు ముందు ఆనందయ్య పిటిషన్ మీద విచారణను హైకోర్టు సాయంత్రం మూడు గంటలకు వాయిదా వేసింది. ప్రభుత్వం సమీక్షలో నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తీర్పు వెలువరిస్తామని హైకోర్టు విచారణను సాయంత్రం మూడు గంటలకు వాయిదా వేిసంది.
మూడు గంటలకు తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత కంట్లో వేసే మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఆ మందుపై నివేదికను గురువారంలోగా తెప్పించుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలావుంటే, ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. కంటిలో వేసే చుక్కుల మందుకు తప్ప మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది. ఆనందయ్య మందులు హానికరం కాదని నివేదికలు వచ్చాయి. సిసిఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది.
కంట్లో మందు వేసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య సోమవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కంట్లో మందు వేసిన మరుక్షణమే తనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి ఈ రోజు మరణించారు.