పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది.. అంబటి రాంబాబు సెటైర్లు..

Published : Oct 21, 2022, 12:34 PM IST
పవన్ నాలుగో పెళ్లిలోపు  పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది.. అంబటి రాంబాబు సెటైర్లు..

సారాంశం

పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పవన్ నాలుగో పెళ్లి చేసుకునేలోగా పోలవరం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

అమరావతి : పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునేలోగా పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది అంటూ చురకలంటించారు. విశాఖ గర్జన, జనవాణి నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య జరిగిన ఘర్షన పరిణామాల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవల వైసీపీ నాయకుల మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చెప్పు చూపిస్తూ.. ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 

ఈ క్రమంలోనే అంబటి రాంబాబును ఉద్దేశించి... మాట్లాడుతూ.. ‘పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో..ఒక్క అరగంట ప్రెస్ మీట్ పెట్టి మట్లాడగలవా అంబటి? అంటూ ఫైర్ అయ్యారు. దీన్నీ జనసేన ప్లయర్ లా తయారు చేసి.. సర్క్యూలేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనిమీద అంబటి రాంబాలు ఆ ఫ్లయర్ ను షేర్ చేస్తూ ‘పవన్ నాలుగో పెళ్లి చేసుకునేలోపు పూర్తి చేసే బాధ్యత నాది’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

కాగా, తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. అంత దమ్ముంటే మీరు కూడా చేసుకోండని పవన్ అనడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిమీద కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అంబటి రాంబాబు అంతకు ముందు కూడా వరుస ట్వీట్లతో పవన్ మీద అంబటి రెచ్చిపోయాడు.. *యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు.. తిరిగి చూస్తే కనిపించడే@.. అంటూ ఓ ట్వీట్ చేయగా.. మరో ట్వీట్ లో ‘అతనికి తిక్కుంది...దానికి బాబు దగ్గర లెక్కుంది’ అంటూ సెటైర్లు వేశారు. 

ఆ చెప్పు జాగ్రత్తగా దాచుకో.. నువ్వు కొట్టుకుని, చంద్రబాబును కూడా కొట్టు : పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్

కాగా, వైసీపీ నాయకులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. దీనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని దీనిమీద ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్ కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీయే ముఖ్యమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసేందుకే జనసేన ఏర్పాటు చేశారంటూ కొడాలి నాని మండిపడ్డారు. 

పవన్ కల్యాణ్ తన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో కొట్టుకోవాలని అన్నారు. అలాగే ఆయన స్థితికి కారణమైన చంద్రబాబును కూడా అదే చెప్పుతో కొట్టాలంటూ కొడాలి నాని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.  కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కల్యాణ్ సిగ్గు లేకుండా కలిసి నడుస్తున్నాడంటూ  మండిపడ్డారు. ముందు బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని నాని చురకలంటించారు. 

పవన్ కళ్యాణ్‌కు కాపు సామాజిక వర్గం, ప్రజలు ముఖ్యం కాదని, కేవలం జగన్‌ను గద్దె దించడమే ప్రధానమని మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు విశాఖకు పంపారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై దాడి జరిగిందని అన్నారు. సినిమాల్లో ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో  కాల్షీట్లు ఇస్తున్నాడని.. చంద్రబాబుని చివరికి ముఖ్యమంత్రిని చేయడమే పవన్ లక్ష్యమని కొడాలి నాని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu