ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై టీడీపీ విమర్శలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ పిల్లి కాదు పులి అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు.శుక్రవారం నాడు ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడారు.
పిల్లికి ,పులికి తేదా తెలియకపోతే నువ్వే ఆహారం అయిపోయితావని పై సెటైర్లు వేశారు. జగన్ ఫోన్ లో ఆడుకుంటూంటే నువ్వు తొంగి చూశావా అని నాని ప్రశ్నించారు.తాము ఏదైనా మాట్లాడితే బూతులు తిట్టామంటారన్నారు.సీఎం జగన్ కు పొలిటికల్ పుట్ బాల్ ఆడటం మాత్రమేతెలుసునని చెప్పారు.ఒకేసారి పదిబాల్స్ తో పొలిటికల్ పుట్ బాల్ ఆడడం జగన్ కు తెలుసునని చెప్పారు.
undefined
జగన్ పై టీడీపీ నేతల విమర్శలపై ఆయన కౌంటరిచ్చార.రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడిస్తున్నాడన్నారు. వికేంద్రీకరణ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ తో జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. లోకేష్ పనికిమాలినవాడు కాబట్టే పక్కపార్టీలతో చంద్రబాబు తిట్టిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని చవట దద్దమ్మ లోకేష్ అంటూ కొడాలి నాని తిట్టి పోశారు..జయంతికి,వర్ధంతికి కూడ లోకేష్ కు తేడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు.
మూడు రాజధానులపై చర్చ జరగవద్దనే టీడీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ఆయన విమర్శించారు.అమరావతి పాదయాత్రను స్థానికులు అడ్డుకుంటే అది దారుణమా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ నేతలకు కొడాలి నాని సూచించారు.అమిత్ షా తిరుపతిలో దైవ దర్శనం కోసం వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి చేయించింది చంద్రబాబు కాదా అని కొడాలి నాని ప్రశ్నించారు. మోడీ పర్యటన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నల్లబెలూన్లు ఎగురవేసింది ఎవరో చెప్పాలన్నారు.
విశాఖలో జగన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఎలా అడ్డుకున్నారో గుర్తుకు లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. ఏడాది పాటు రోజాను అసెంబ్లీలోకి రాకుండా సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ విషయాలను చంద్రబాబు నాయుడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదన్నారు.23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోలేదా అని ఆయన అడిగారు. ముద్రగడ పద్మనాభాన్ని ఎలా అవమానించారో ప్రజలకు తెలుసునన్నారు.పిల్లనిచ్చిన మామాను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.చంద్రబాబు చిన్న చితక పార్టీల బూట్లు నాకే పరిస్థితి వచ్చిందన్నారు.చంద్రబాబు చేసిన తప్పుల వల్లే టీడీపీ 23 సీట్లకే పరిమితమైందన్నారు.