నిబంధనలు పాటించని కారణంగా 175 ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. ఈ కాలేజీల్లో చదువుతున్న 20వేల మంది విద్యార్ధులను వేరే కాలేజీల్లో చేర్చాలని ఆదేశించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిమ 175 ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ప్రభుత్వ నిబంధనలు పాటించని 175 ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకుుంటున్నట్టుగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆయా కాలేజీల యాజమాన్యాలకు సమాచారం పంపారు.ఈ కాలేజీల్లో చదువుతున్న 20 వేల మంది విద్యార్ధులను వేరే కాలేజీల్లో చేర్పించాలని కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదేశించారు.
కాలేజీలు నిర్వహిస్తున్న భవనాలకు అనుమతి పొందిన ప్లాన్ లేకపోవడం, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయితే ఈ నిబంధనలను పాటించని కారణంగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకుంది.