మూడు రాజధానులు: హైకోర్టు తలుపు తట్టిన అమరావతి రైతులు

By telugu teamFirst Published Jan 22, 2020, 10:13 AM IST
Highlights

సీఎం వైస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ రాజధానిగా అమరావతిాని కొనసాగించాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైస్ జగన్ మూడు రాజధానులపై అమరావతి రైతులు హైకోర్టు తలుపులు తట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ వారు ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం మధ్యాహ్నం విచారణకు జరగనుంది. 37 మంది రైతులు ఆ పిటిషన్ దాఖలు చేశారు.

సీఆర్డీఎ రద్దుపై మరో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాగా, అమరావతి రైతుల ఆందోళన బుధవారంనాటికి 36వ రోజుకు చేరుకుంది.  అమరావతి ఏజేసి పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్ వాతావరణం నెలకొంది. వర్తకులు స్వచ్ఛందంగా  దుకాణాలు మూసివేశారు. వర్తకులుతుళ్లూరు మండలంలో అన్ని గ్రామాలు పోలీస్ల ఆధీనంలో ఉన్నాయి, 

Also Read: రూల్‌ నెం 71పై ఓటింగ్: టీడీపీ నెగ్గింది, కానీ ఇద్దరు ఎమ్మెల్సీల షాక్

సచివాలయం పరిసర ప్రాంతాలలో పశువులు మేపుకునే వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ప్రధాన కూడళ్ళలో ముళ్ళ కంచెలను పోలీసులు అందుబాటులో ఉంచారు.144 సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉన్నాయి. 29 గ్రామాల్లో బహిరంగ నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదు. రోడ్లపై జనాలను గుంపులుగా ఉండనివ్వడం లేదు.  ఇదిలావుంటే, మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం లభించకపోవడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొన్నది. 

బిల్లు ఆమోదంపై ఉత్కంఠ

శాసనమండలి లో కీలక బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రూల్ 71 నోటీసు పై చర్చలో విజయం సాధించిన టీడీపీ బుధవారంనాడు రెండు బిల్లులపై వేరువేరుగా చర్చ జరగాలని పట్టుబడుతోంది. బిల్లులలకు సవరణలు ప్రతిపాదించడదం లేదా బిల్లును సెలెక్ట్ కమిటీకీ పంపించడం అనే  రెండు ప్రతిపాదననలపై టీడీపీ ఆలోచన చేస్తోంది. 

Also Read: ఎట్టకేలకు అనుమతించిన ఛైర్మన్: వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన బుగ్గన

చర్చ ముగిసిన తర్వాత టీడీపీ తుది నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. సెలెక్ట్ కమిటీ కి పంపితే మూడు నెలల పాటు బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉండదు. సవరణలు సూచిస్తే బిల్లు తిరిగి శాసనసభకు వెళ్తుంది. బిల్లుపై ఓటింగ్ కు వెళ్తే టీడీపీలో చీలిక వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

click me!