ఇంత చిన్న రాష్ట్రంలో జగన్ తీసుకున్న మూడు రాజధానులు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శాసనసభ తీర్పును అందరూ గౌరవించాల్సిందేనన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మొన్నటి వరకు అమరావతి ఉంది. దానిని మార్చి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకువచ్చారు. పరిపాలనంతా విశాఖలో ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఈ మూడు రాజధానులపై తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.
ఇంత చిన్న రాష్ట్రంలో జగన్ తీసుకున్న మూడు రాజధానులు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శాసనసభ తీర్పును అందరూ గౌరవించాల్సిందేనన్నారు.
undefined
Also Read రూల్ నెం 71పై ఓటింగ్: టీడీపీ నెగ్గింది, కానీ ఇద్దరు ఎమ్మెల్సీల షాక్...
దేశంలో కోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామన్నారు. జగన్ ఆశించినంత సులభంగా మూడు రాజధానుల ఏర్పాటు జరగవని చెప్పారు. అమరావతే రాజధాని అని కేంద్రానికి నివేదికలు పంపుతాడని... బ్రెయిన్ మాత్రం విశాఖపట్నంలో పెడతాడని జేసీ పేర్కోన్నారు. మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటేరియట్ లాంటిదని చెప్పారు.
సెక్రటేరియట్ లేకుంటే ఏలాంటి ఉపయోగం ఉండదన్నారు. రాజధాని అమరావతికి ఎటువంటి వరద ముప్పు లేదని చెప్పారరు. ఎందుకుంటే కృష్ణానది ఎగువన చాలా ప్రాజెక్టులు నిర్మించారని.. అమరావతే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పారు.