రాజధాని భూముల స్కాం: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు

By narsimha lodeFirst Published Sep 15, 2020, 11:53 AM IST
Highlights

రాజధాని భూముల విషయంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. శ్రీనివాసరావుతో పాటు మరో 12 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.


అమరావతి: రాజధాని భూముల విషయంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. శ్రీనివాసరావుతో పాటు మరో 12 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.

also read:చంద్రబాబుకు షాక్: అమరావతి భూముల స్కామ్ మీద ఏసీబీ కేసు

అధికార దుర్వినియోగం చేసి బంధువులకు భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో  టీడీపీకి చెందిన  నేతలు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపించింది.

జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపించింది.ఈ విషయమై కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడ ఇచ్చింది. ఈ నివేదికలో సుమారు 4 వేల ఎకరాల భూమి టీడీపీకి చెందిన నేతలు కొనుగోలు చేశారని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది.

అమరావతి భూముల కొనుగోలు వ్యవహరంపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఈ కేసులో ఇద్దరు రెవిన్యూ అధికారులు కూడ అరెస్ట్ కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 

also read:అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యలు:వ్యూహాం ఇదీ..

మరో వైపు ఏసీబీ అధికారులు కూడ విచారణ చేస్తున్నారు. సిట్ విచారణ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు.

2014 జూన్- డిసెంబర్ మధ్య కాలంలో దమ్మాలపాటి శ్రీనివాసరావు తన బంధువుల పేరున భూములు కొనుగోలు చేశారని ఏసీబీ గుర్తించింది. 

ఇదిలా ఉంటే దమ్మాలపాటి శ్రీనివాసరావు సోమవారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని శ్రీనివాసరావు పిటిషన్ లో హైకోర్టును కోరారు. 

click me!