ముగిసిన పోలీస్ కస్టడీ.. నోరు విప్పని నూతన్ నాయుడు

By telugu news teamFirst Published Sep 15, 2020, 11:03 AM IST
Highlights

విజయవాడకు చెందిన శశికాంత్ అనే వ్యక్తి కూడా లావాదేవీల నడుమ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో  వివరాలు సేకరిస్తున్నారు. శిరోముండనం, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించుకొని మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే నూతన్ నాయుడిని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.

విశాఖ నగరం మహారాణిపేట స్టేషన్ లో నూతన నాయుడు పై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి.. పోలీసుల విచారణ కొనసాగుతోంది. తెలంగాణకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి ఎస్బీఐ లో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని చెప్పి రూ.12కోట్లు, నూకరాజు అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు కేసు నమోదైంది.

కాగా.. పోలీసులు వారి బ్యాంకు ఖాతాలపై, ఇతరత్రా లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్లు డీసీపీ 1 ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఎస్బీఐ డైరెక్టర్ పదవికి అంత మొత్తం ఇవ్వటానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. విజయవాడకు చెందిన శశికాంత్ అనే వ్యక్తి కూడా లావాదేవీల నడుమ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో  వివరాలు సేకరిస్తున్నారు. శిరోముండనం, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ పేరును ఉపయోగించుకొని మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే నూతన్ నాయుడిని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కాగా.. ఈ కస్టడీ సోమవారంతో ముగిసింది.

అయితే.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సరైన సమాధానాలు చెప్పనట్లు తెలుస్తోంది. కాగా.. అతనిని మరోసారి కస్డడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

click me!