అమరావతిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయండి: మోడీకి రైతుల లేఖ

Published : Sep 14, 2020, 08:25 PM IST
అమరావతిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయండి: మోడీకి రైతుల లేఖ

సారాంశం

రాజధాని రైతులపై ఏపీ ప్రభుత్వం ఆపేలా చూడాలని అమరావతి ప్రాంత రైతులు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

అమరావతి: రాజధాని రైతులపై ఏపీ ప్రభుత్వం ఆపేలా చూడాలని అమరావతి ప్రాంత రైతులు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

అవసరాల కోసం భూమిని అమ్మినా సిట్, సీఐడీ, సబ్ కమిటీ పేర్లతో ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేస్తోందని రైతులు ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంతో తమకు జరిగిన న్యాయబద్దమైన ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం గౌరవించడం లేదని రైతుల ఆరోపించారు.

also read:అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యలు:వ్యూహాం ఇదీ..

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వారు ఆరోపించారు. అమరావతిని కాపాడేలా పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ప్రధానిని రైతులు కోరారు.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు సుమారు 265 రోజులకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అమరావతిపై ప్రకటన చేయాలని రైతులు ప్రధానిని కోరారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.ఈ విషయమై ఏపీ హైకోర్టులో రెండు అఫిడవిట్లను కేంద్రం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు