ఏపీలో కరోనాది అదే జోరు: మొత్తం కేసులు 5,75,079కి చేరిక

By narsimha lodeFirst Published Sep 14, 2020, 6:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7956 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 60 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5 లక్షల 75 వేల 079కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7956 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 60 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5 లక్షల 75 వేల 079కి చేరుకొన్నాయి. 

రాష్ట్రంలో 93,204 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకిన 4 లక్షల 76వేల 903 మంది కోలుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 61,529 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 7,956 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 60 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో  మరణించిన వారి సంఖ్య  4,972 మందికి చేరుకొంది.


గత 24 గంటల్లో అనంతపురంలో 483, చిత్తూరులో 748, తూర్పుగోదావరిలో 1412, గుంటూరులో 666, కడపలో 326, కృష్ణాలో 201, కర్నూల్ లో 341, నెల్లూరులో 756, ప్రకాశంలో  444, శ్రీకాకుళంలో 517, విశాఖపట్టణంలో 490, విజయనగరంలో 481, పశ్చిమగోదావరిలో 1091 కేసులు నమోదయ్యాయి. 


రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -49,789, మరణాలు 414
చిత్తూరు  -50,146 మరణాలు 534
తూర్పుగోదావరి -78,220, మరణాలు 458
గుంటూరు  -46,004 మరణాలు 465
కడప  -36,491, మరణాలు 310
కృష్ణా  -21,475, మరణాలు 351
కర్నూల్  -51,966, మరణాలు 422
నెల్లూరు -44,130 మరణాలు 394
ప్రకాశం -36,886, మరణాలు 379
శ్రీకాకుళం -32,2747 మరణాలు 290
విశాఖపట్టణం  -44,338, మరణాలు 363
విజయనగరం  -28,427, మరణాలు 200
పశ్చిమగోదావరి -51,565, మరణాలు 392

 

: 14/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,72,184 పాజిటివ్ కేసు లకు గాను
*4,74,008 మంది డిశ్చార్జ్ కాగా
*4,972 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 93,204 pic.twitter.com/9pf2NGHw7X

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!