ఆళ్ల నాని : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 27, 2024, 1:27 AM IST
Highlights

Alla Nani Biography: ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని. కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి గుర్తింపు ఉన్న నేత‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆళ్ల నాని వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం..    

Alla Nani Biography: ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని. కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి గుర్తింపు ఉన్న నేత‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆళ్ల నాని వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం..    

బాల్యం, విద్యాభ్యాసం

ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. కానీ, ఆయన ఆళ్ల నానిగా సుపరిచితం. ఆయన 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల సూరి చందర్రావు నాగమణి గార్ల దంపతులకు జన్మించారు ఏలూరులోనే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆయన కుటుంబం గురించి చూస్తే..  ఆయన సతీమణి పేరు ఆళ్ల రేఖ. వీరికి ఇద్దరూ పిల్లలు. 

రాజకీయ ప్రవేశం 

ఆళ్లనానికి ముందు నుంచే రాజకీయాలంటే ఆసక్తి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా ఆక్టివ్ గా పని చేసేవారు. దీంతో 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు శాసనసభ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నాని ఓటమి పాలయ్యారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. ప్రజ సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగారు. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి మరోసారి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగారావు పై భారీ మెజారిటీతో గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో కాలుమోపారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా ఆయన..ఆ  ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థి కోట రామారావుపై 13,682 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

వైసీపీలో చేరిక

వైఎస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ లో జరిగిన రాజకీయాలు తనకు నచ్చక 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అష్టకాలంలో వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వాటిని పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన టిడిపి తరఫున పోటీ చేసిన కోటా రామారావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓటమిపాలైన ఆయన్ని జగన్ ఎమ్మెల్సీగా నిలబెట్టారు. 2017 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆళ్ళ నాని. 

ఉపముఖ్యమంత్రిగా..

ఇక 2019 ఎన్నికల్లో  ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల నాని తన సమీప అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. నాని 2019 ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలవడంతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇక జగన్ తన తొలి మంత్రి వర్గంలోని నానికి చోటు కల్పించారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రిగా నియమించారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనను  మంత్రి పదవి నుంచి తొలగించారు.  ఎన్నో ఏళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనే చూసుకున్నారు.

click me!