
ఏపీ బీజేపీకి కొత్త కార్యవర్గాన్ని నియమించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పురందేశ్వరితో సహా మొత్తం 26 మందితో కొత్త కమిటీని ఆమె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆమె సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంపిక చేసిన వారికి స్వయంగా ఫోన్లు చేస్తున్నారు పురందేశ్వరి. సాయంత్రానికి జాబితా విడుదల చేసే అవకాశం వుంది. మాధవ్, విష్ణులతో సహా నలుగురు ప్రధాన కార్యదర్శులకు ఉధ్వాసన పలికారు. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ వున్న వారికి ఈసారి అవకాశం కల్పించలేదు. అలాగే కొన్ని జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జీఎస్‌గా బిట్రా సూర్యనారాయణను కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.