‘నంద్యాల’లో ఓడిపోతే రాజీనామా చేస్తా

Published : Jun 26, 2017, 04:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
‘నంద్యాల’లో ఓడిపోతే రాజీనామా చేస్తా

సారాంశం

నైతిక విలువలకు-ఒత్తిడికి మధ్య నలిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. తండ్రితో పాటు పార్టీ మారిందే కానీ సొంతంగా రాజకీయాలు చేయగలిగే సత్తా మంత్రిలో కనబడలేదు. తల్లి చనిపోయిన కారణంగా ఎంఎల్ఏ అయ్యంది. తండ్రి చనిపోయిన కారణంగా మంత్రి కూడా అయింది. అంటే రెండు పదవులు కూడా ఊహించకుండానే వచ్చి పడ్డాయి.

కొత్తగా మంత్రైన అఖిలప్రియ పెద్ద మాటలే మాట్లాడుతున్నారు. ఒకవైపు నంద్యాల ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చంద్రబాబునాయుడే ప్రయత్నిస్తుంటే మరోవైపు అఖిలేమో వైసీపీని సవాలు చేస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ఓ ఛానల్ తో మాట్లాడుతూ,  నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఓడిపోతే మంత్రిపదవికి రాజీనామా చేయటంతో పాటు రాజకీయాలనుండే తప్పుకుంటానని చెప్పటం పార్టీలో తీవ్ర చర్చనీయంశమైంది.

ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి మరికొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డారు. తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఆళ్ళగడ్డ, నంద్యాల ఎన్నికల్లో నంద్యాల నుండి నాగిరెడ్డి కేవలం 2 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే గెలిచారు. అదే విషయమై అడిగినపుడు అప్పట్లో నంద్యాలలో శోభా సింపతి లేదని అంగీకరించారు. శిల్పాకు నైతిక విలువలే లేవని విరుచుకుపడిన మంత్రి భూమానాగిరెడ్డి వైసీపీని వీటి టిడిపిలో చేరిన విషయమై మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.

ఎందుకంటే, వైసీపీ తరపున గెలిచిన నాగిరెడ్డి కేవలం మంత్రిపదవి కోసమే పార్టీ మారినట్లు అంగీకరించిన విషయం గమనార్హం. అదే విషయాన్ని అఖిల వద్ద ప్రస్తావించగా సమాధానం చెప్పలేకపోయారు. వైసీపీ తరపున గెలిచిన మంత్రిని నిజంగా ప్రజాబలమే ఉంటే వెంటనే రాజీనామా చేయవచ్చుకదా అని ప్రశ్నించగా చంద్రబాబు చెబితే రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం విచిత్రంగా ఉంది.

‘మీకంటూ నైతికవిలువలు లేవా’ అన్న ప్రశ్నకు మంత్రి ఏం సమాధానం చెప్పలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో టిడిపి, భాజపాతో పాటు వైసీపీ కూడా ఉన్నందున నడుస్తున్నది సంకీర్ణ ప్రభుత్వమేనా అన్న ప్రశ్నకు కూడా అఖిల ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.

ఇంటర్వ్యూలో అఖిల మాటలు చూస్తుంటే, నైతిక విలువలకు-ఒత్తిడికి మధ్య నలిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. తండ్రితో పాటు పార్టీ మారిందే కానీ సొంతంగా రాజకీయాలు చేయగలిగే సత్తా మంత్రిలో కనబడలేదు. తల్లి చనిపోయిన కారణంగా ఎంఎల్ఏ అయ్యంది. తండ్రి చనిపోయిన కారణంగా మంత్రి కూడా అయింది. అంటే రెండు పదవులు కూడా ఊహించకుండానే వచ్చి పడ్డాయి. అందుకే వర్గ రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు కనబడుతోంది. కాబట్టే ఉపఎన్నికల్లో ఓడిపోతే మంత్రిపదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుండి తప్పుకుంటాలాంటి పెద్ద మాటలు మాట్లాడుతోంది.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: పిఠాపురం లో పవన్ ఎంట్రీ చూసి బసవయ్య రియాక్షన్ చూడండి | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Visit Pithapuram Sankranti: సంక్రాంతి వేడుకల్లోడిప్యూటీ సీఎం | Asianet Telugu