ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

By ramya neerukondaFirst Published Aug 29, 2018, 10:40 AM IST
Highlights

స్వగ్రామం నిమ్మకూరులోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. నిమ్మకూరులోని హరికృష్ణ సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

నందమూరి హరికృష్ణ మృతితో టీడీపీ నేతలు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన స్వగ్రామం నిమ్మకూరులోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. నిమ్మకూరులోని హరికృష్ణ సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

హరికృష్ణ  గురించి నిమ్మకూరులోని ఆయన సన్నిహితులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..‘‘హరికృష్ణ నిమ్మకూరు ఎప్పుడు వచ్చినా అందరితో కలివిడిగా ఉండేవాడు. ఆయన ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాడు. బంధుమిత్రులతో అనుబంధంగా ఉండేవాడు. ఎంపీ నిధుల నుంచి రూ. మూడున్నర కోట్లు మంజూరు చేసి గ్రామంలో రోడ్డు, నీటి సరఫరా తదితర పనులు చేశాడు. పక్క గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి చేశాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో హరికృష్ణ తెలియని వారు లేరు. నిమ్మకూరులో ఉన్న వారిలో చాలా మంది పేర్లు తెలుసు. అంతేకాదు, ఎన్టీఆర్ గారి తర్వాత గ్రామంలో ఎవరి ఇల్లు ఎక్కడుందో హరికృష్ణ ఒక్కడికే తెలుసు. అలాంటి వ్యక్తి లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం’’ అంటూ నిమ్మకూరులోని హరికృష్ణ బంధువులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్న హరికృష్ణ

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

click me!