మహిళలపై వ్యాఖ్యలు: జోక్యం చేసుకున్న వైవీ, రాజీనామాకు సిద్ధమైన పృథ్వీ..?

By Siva KodatiFirst Published Jan 12, 2020, 6:28 PM IST
Highlights

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు పృథ్వీరాజ్. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఆయనను రాజీనామా చేయాలని కోరడంతో పృథ్వీ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. 

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు పృథ్వీరాజ్. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఆయనను రాజీనామా చేయాలని కోరడంతో పృథ్వీ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఆరోపించిన పృథ్వీ.. ప్రజల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడు ఊహించలేదన్నారు. 

ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్  అసభ్యంగా మాట్లాడినట్టుగా  సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై పృథ్వీరాజ్  ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

Also Read:విచారణలో అన్నీ తెలుస్తాయి, రైతులకు క్షమాపణ: పృథ్వీ వీడియో

చానెల్ ఉద్యోగుల పట్ల తాను ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని చెప్పారు. తాను అందరికి అన్నగానే ఉన్నానని చెప్పారు. తన ఆడియోను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు.

అన్యమత ప్రచారం గురించి కూడ తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనల విషయంలో పృథ్వీ చేసిన ఆరోపణలపై కూడ ఆయన వివరణ ఇచ్చారు.

రాజధాని  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తాను అనలేదన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు. తన మాటలకు రైతులు బాధపడినందుకుగాను  తనను క్షమాపణలు చెబుతున్నట్టుగా పృథ్వీ ఆ వీడియోలో వివరించారు.

Also Read:ఉద్యోగినితో పృథ్వీ అసభ్య సంభాషణ: విచారణకు టీటీడీ ఛైర్మెన్ ఆదేశం

ఉద్యోగినిని అసభ్యంగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ తనకు తలవొంపులు తెచ్చేవిధంగా ఉందన్నారు. తాను పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ తెలిపారు.

విజిలెన్స్ విచారణలో  అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పోసాని కృష్ణమురళి మాదిరిగానే తాను కూడ ముక్కుసూటిగా మాట్లాడుతానని చెప్పారు.పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా తాను ఏనాడూ వ్యవహరించలేదని తెలిపారు
 

click me!