వైఎస్ జగన్ ను కలిసిన సినీనటుడు భాను చందర్

Published : Dec 23, 2018, 12:47 PM IST
వైఎస్ జగన్ ను కలిసిన సినీనటుడు భాను చందర్

సారాంశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే సినీనటులు పోసాని కృష్ణమురళీ, పృధ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.   

శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే సినీనటులు పోసాని కృష్ణమురళీ, పృధ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. 

తాజాగా సీనినటుడు భానుచందర్ పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలిశారు. శ్రీకాకుళం జిల్లాలో 329వ రోజు పాదయాత్రను టెక్కలి నుంచి జగన్ చేపట్టారు. అక్కడి నుంచి గూడెం, సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం, కుంచుకోట మీదుగా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. 

ఏడాది కాలంగా వైఎఎస్ జగన్ పాదయాత్ర చెయ్యడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని భాను చందర్ కోరారు. కాసేపు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ భానుచందర్ పాదయాత్రలో పాల్గొన్నారు. 


 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?