విశాఖ శారదా పీఠంలో అడుగుపెట్టిన కేసీఆర్

Published : Dec 23, 2018, 12:09 PM ISTUpdated : Dec 23, 2018, 02:08 PM IST
విశాఖ శారదా పీఠంలో అడుగుపెట్టిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తానన్న కేసీఆర్.. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి యాత్రను చేపట్టారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరకున్న కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ చేరుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తానన్న కేసీఆర్.. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి యాత్రను చేపట్టారు.

కుటుంబసభ్యులతో కలిసి ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరకున్న కేసీఆర్ ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

చంద్రశేకర్ రావును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్ వద్దకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ జనానికి అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠానికి చేరుకున్నారు. అక్కడ స్వరూపానంద ఆశీస్సులు తీసుకుని కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

శారద పీఠంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: ఇక కాస్కోండి.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే. భారీ వ‌ర్షాలు.
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu