రెచ్చిపోతున్న అచ్చెన్న

Published : Apr 10, 2017, 08:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రెచ్చిపోతున్న అచ్చెన్న

సారాంశం

మొత్తంమీద అధికార మత్తు మంత్రికి బాగానే తలకెక్కినట్లు ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి పరిస్ధితి ఎలాగుంటుందో ఏమో.

చంద్రబాబునాయుడు అండ చూసుకుని కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు రెచ్చిపోతున్నారు. అటువంటి వారిలో మంత్రి  కింజరాపు అచ్చెన్నాయడు ఒకరు. మంత్రివర్గ విస్తరణ తర్వాత శ్రీకాకుళం జిల్లా తలెత్తిన పరిణామాలతో అచ్చెన్నపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. దాంతో మంత్రిపై పార్టీలోనూ, బయటా ఉన్న వ్యతిరేకత బయటపడుతోంది. ఇంతకీ జరిగిందేమిటంటే, మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని సీనియర్ ఎంఎల్ఏ గౌతు శ్యామసుందర్ శివాజి ఆశించారు. తీరా రాకపోయేసరికి తీవ్ర నిరాస చెందారు. మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు కూడా.

దాంతో తండ్రికి మద్దతుగా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ కుమార్తె గౌతు శిరీష హెచ్చరించారు. దాంతో శివాజీతో మాట్లాడి సర్దుబాటు చేయమని చంద్రబాబు అచ్చెన్నను పురమాయించారు. అయితే, బాధలో ఉన్న శివాజిని సముదాయించాల్సిన మంత్రి మరింత ఆజ్యం పోసారని ప్రచారం జరుగుతోంది. మంత్రిపదవి అడిగితే మర్యాదగా ఉండదని తీవ్రంగా హెచ్చరించారట. పార్టీలో తిరుగుబాటంటే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి శివాజికి వార్నింగ్ ఇచ్చారట. శిరీష భర్త వెంకన్న చౌదరిపై ఉన్న ఆరోపణలు ప్రస్తావిస్తూ అరెస్టు చేయిస్తానంటూట బెదిరించారని ప్రచారం.

జిల్లా అధ్యక్షపదవికి శిరీష రాజీనామా చేస్తే ఆమె భర్తను వెంటనే జైలుకు పంపుతానంటూ మంత్రి హెచ్చరించారని పార్టలో ప్రచారం జరుగుతోంది. అచ్చెన్న బెదిరింపులతో భయపడిపోయిన శివాజి కుటుంబం ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కువ మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో అసలు టిక్కెట్టే రానీయకుండా చేస్తానంటూ మంత్రి శివాజికి వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం మొదలైంది.

ఉద్యోగం కోసం మంత్రివద్దకు వెళితే తనను తిట్టి, కొట్టినట్లు ఓ మహిళ బహిరంగంగానే మంత్రిపై ఆరోపణలు చేయట గమనార్హం. అంతేకాకుండా వెలగపూడి సచివాలయం వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. అంతుకుముందే శ్రీకాకుళం ఎంపి రాంమాధవనాయడు, తల్లితో కలిసి బాబాయ్ కమ్ మంత్రి అచ్చెన్నాయడుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తంమీద అధికార మత్తు మంత్రికి బాగానే తలకెక్కినట్లు ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి పరిస్ధితి ఎలాగుంటుందో ఏమో.

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Visits Innovation Fair: ఈ రోబో చేసిన పనికి షాకైన మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాలుష్యాన్ని నివారించలేంనియంత్రించవచ్చు: పవన్ | Asianet News Telugu