
రాష్టంలో విపరీతంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటంతో ప్రజలువడదెబ్బబారిన పడకుండా ఉండందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్య లు మొదలపెట్టింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక కూడా చేసింది. ఈ నేపథ్యం వడదెబ్బ సోకి ఎవరూ మృత్యువాతపడకుండా ఉండేందుకు అత్యవసర చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్ర వ్యాపితంగా గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరాకు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. దీనికోసం జిల్లాలవారీగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి వేసవి వడదెబ్బలు సోకి ప్రజలు మృత్యువాత పడకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వడడెబ్బ నుంచి రక్షణ తీసుకోవలసి చర్య ల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఆయన ఆదేశించారు. దీని కోసం రు.9 కోట్లు విడుదల చేశారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ.పోయిన తూరి జిల్లా కు రు. 3 కోట్ల చొప్పున మొత్తం 39 కోట్లు మజ్జిగ మీద ఖర్చు చేశారు.
ప్రతిచోటా దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 నుంచి 40 డిగ్రీల దాకా పోయే సూచనలుకనిపిస్తున్నాయి. గత ఏడాది ఉష్ణోగ్రత 46 దాటినపుడు ఆంధ్ర తెలంగాణాలలో వందల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఈ పరిస్థితి గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. 2015లో రెండు రాష్ట్రాలలో రెండు వేల మంది దాకా చనిపోయారు. 2016లో కూడా 1500 మంది పైగా చనిపోయారు.
వడగాడ్పులలో మంచినీళ్లు , మజ్జిగ తో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కోటి చొప్పున, మిగతా పది జిల్లాలకు 60లక్షల చొప్పున మొత్తం 9 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.