కొలువు అమరావతిలో... కొత్తిల్లు హైదరాబాద్ లోనా

Published : Apr 10, 2017, 05:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కొలువు అమరావతిలో... కొత్తిల్లు హైదరాబాద్ లోనా

సారాంశం

ముఖ్యమంత్రి కట్టదిట్టమయిన పర్మనెంట్ అడ్రసు హైదరాబాద్ లో  ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫ్యామిలీ పర్మనెంట్ అడ్రసు హైదరాబాదా? కొలువు అమరావతి, పర్మనెంట్ విలాసం హైదరాబాద్ లో. అంతా హైదరాబాద్ తో సంబంధాలు తెంచుకోవాలి.  భాగ్యనగరంతో  తన అనుబంధం  మాత్రం పటిష్టం కావాలి ... ఏమిటీ ఇందులోని తిరాకాసు.

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ పర్మెనెంట్ అడ్రసు పూర్తయింది.  

 

జూబ్లీహిల్స్ లో కొత్తగా పటిష్టంగా నిర్మించిన ఇంట్లోకి ఆదివారం ఉదయం గృహప్రవేశం చేశారు.   చంద్రబాబు నాయుడు  గత 30 ఏళ్ళ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌65లో నివాసముంటున్నారు. ఇటీవల పాత ఇంటిని కూల్చి, పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసి 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో కొత్త ఇంటిని నిర్మించారు.

 

అధికార,రాజకీయ కార్యకలాపాలకు అనువుగా దీనిని రూపుదిద్దారు.  వీడియో కాన్ఫరెన్సుల ఏర్పాటుతో కాన్షరెన్స్ హాల్ , 20 కార్లు నిలిపేందుకు వీలుగా విశాలమయిన పార్కింగ్‌ ప్రదేశం, పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు ఇంటి ఆవరణలో లాన్స్‌, సెక్యూరిటీ పోస్టు తదితర అన్ని సౌకర్యాలతోనాయుడిగారి హైదరాబాద్ పర్మనెంట్ అడ్రసు తయారయింది. 

ఇదంతా బాగానే ఉంది.


హైదరాబాద్ నుంచి అందరిని ఉన్న ఫలానా వచ్చేయాలని ఉద్యోగులను హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి  లోటస్ పాండ్ లో కనసాగడాన్ని తెలుగుదేశం  నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. కంపెనీలు కూడా హెడ్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి అమరావతికి  మార్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో మారాయని కూడా వార్తలొచ్చాయి. అయినా ముఖ్యమంత్రి   కూడా కార్యాలయాన్నింటిని విజయవాడకు మార్పించారు. టిడిపి ఆఫీసుకు కూడా తరలిపోయింది. ఇపుడు హైదరాబాద్ లో ఎలాంటి సమీక్షా  సమావేశాలు పెట్టరాదని చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్ గత వారం తాజాగా మరొక ఉత్తర్వు జారీ చేశారు. ఎవరయినా హైదారబాద్ లో మీటింగ్ పెడితే సహించేది లేదని  కూడా హెచ్చరించారు. 


మరి ముఖ్యమంత్రి కట్టదిట్టమయిన పర్మనెంట్ అడ్రసు హైదరాబాద్ లో  ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫ్యామిలీ పర్మనెంట్ అడ్రసు హైదరాబాదా?


కొలువు అమరావతి, పర్మనెంట్ విలాసం హైదరాబాద్ లో... అంటే, ముఖ్యమంత్రికి ఏ  నియమాలు వర్తించవా?


అందరినీ హైదరాబాద్ తో సంబంధాలు తెంచుకోవాలని హెచ్చరించి, భాగ్యనగరంతో  తన అనుబంధం  మాత్రం పటిష్టం చేసుకోవడం... ఏమిటీ ఇందులోని తిరాకాసు.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu