రాష్ట్రంలో దేవుడి పాలనా?

Published : Jun 04, 2017, 10:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రాష్ట్రంలో దేవుడి పాలనా?

సారాంశం

జరుగుతున్నదంతా దేవుడి ఆదేశాల ప్రకారమే అయితే, మరి అంతా తానే చేసానని, తన గొప్పదనమే అని ఊదరగొట్టటం ఎందుకు? చివరకు రాష్ట్ర విభజన కూడా దేవుడి ఆదేశాల ప్రకారమే జరిగిందని సరిపెట్టుకుంటే పోలా? అనవసరంగా కాంగ్రెస్ ను  శాపనార్ధాలు పెట్టటం ఎందుకు?

మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నది దేవుడి పాలనే అని చంద్రబాబునాయుడు కూడా అంగీకరించారు. దివంగత సిఎం వైఎస్ఆర్ కూడా ఇదే డైలాగ్ చెప్పేవారు. అదే డైలాగ్ ను తాజాగా చంద్రబాబునాయుడూ వినిపించారు. రాజధాని, పోలవరం నిర్మించమని భగవంతుడు ఆదేశించాడట. అందుకే కడుతున్నారట.

అంటే చంద్రబాబు చెప్పిన ప్రకారం జరిగింది, జరుగుతున్నదంతా దేవుడి ఆదేశానుసారమే జరుగుతోంది. మరి భగవంతుడు చెప్పిందే ఫైనల్ అయితే, అదే భగవంతుడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉండామన్నాడని ఎందుకు అనుకోకూడదు? జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర దురదృష్టమని ఎందుకు పదే పదే అంటుంటారు.

రాజధాని, పోలవరం కట్టమని దేవుడే ఆదేశించాడు సరే, మరి పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పింది కదా? అవినీతికి పాల్పడమని కూడా దేవుడే చెప్పాడా? జరుగుతున్నదంతా దేవుడి ఆదేశాల ప్రకారమే అయితే, మరి అంతా తానే చేసానని, తన గొప్పదనమే అని ఊదరగొట్టటం ఎందుకు? చివరకు రాష్ట్ర విభజన కూడా దేవుడి ఆదేశాల ప్రకారమే జరిగిందని సరిపెట్టుకుంటే పోలా? అనవసరంగా కాంగ్రెస్ ను  అమ్మనాబూతులు తిట్టటం ఎందుకు?

విభజన బాధాకరంగా జరిగిందని అరిగిపోయిన రికార్డులనే వినిపించారు. కాంగ్రెస్ ను భూస్ధాపితం చేయాలట. పైగా కాంగ్రెస్ కు ఎవరూ సహకరించవద్దని, కాంగ్రెస్ మీటింగ్ కు వెళితే రాష్ట్రప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనంటూ ఫత్వా జారిచేయటం గమనార్హం.

కేంద్రం నుండి రాష్ట్రానికి ఇప్పటి వరుకూ వచ్చింది కేవలం రూ. 3950 కోట్లేనంటూ స్పష్టం చేసారు. మొన్నటి వరకూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి బాగానే నిధులు వస్తున్నాయంటూ చెప్పిన చంద్రబాబు ఇపుడు రూ. 3950 కోట్లేనంటూ చెప్పటమేమిటో? పనిలో పనిగా హైదరాబాద్ అభివృద్ధి అంతా తనవల్లే అని మళ్ళీ చెప్పారు. హైదరాబాద్ 400 ఏళ్ళ చరిత్రలో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఎనిమిదన్నరేళ్ళే. అంతకుముందు, తర్వాత హైదరాబాద్ లో అభివృద్ధి ఏమీ జరగలేదా?

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu