ఈ వైజాగ్ తాహశీల్దార్ వెనకేసిన కొత్త నోట్లెన్నో తెలుసా...

First Published Feb 23, 2017, 12:47 PM IST
Highlights

ఇంటి  బేస్ మెంట్ లో డూప్లికేట్ ఎమ్మార్వో ఆఫీస్ తెరిచిన తాహశీల్దారీయన

ఈ తాహశీల్దార్ అసాధ్యడండోయ్.

 

అతగాడి దగ్గిర ఉన్న కొత్త కరెన్సీ నోట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులే  చూసి డంగైపోయారు.

 

విశాఖపట్నం జిల్లా భీమ్లీ తాహశీల్దార్ బి టివి రమణారావు వెనకేసుకున్న కొత్త కరెన్సీ ఎంతో తెలుసా...  రు. 41 లక్షలు.

 

దీనితో పాటు ఆయన ఇంట్లో ఒక కెజీ బంగారు, ఆస్తులకు సంబంధించిన బోలెడు డాక్యుమెంట్లు దొరికాయి. ఈ మొత్తం విలువ దాదాపు  అయిదు కోట్లుంటుందని అంచనా వేశారు. రమణారావు తో ఆయన బంధువుల ఇళ్ల మీద కూడా దాడి చేసిన అనేక డాక్యమెంట్లు సంపాదించాక, ఆయన మీద అక్రమార్జన కేసులు పెడుతున్నట్లు విశాఖ ఎసిబి డిఎస్పి కె రమణ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

 

ఈ తాహశీల్దార్ తన అక్రమాలను భారీగా జరిపేవాడు. దీనికోసం ఆయనకు ప్రత్యేక సెటప్ అవసరమయింది.  అక్కయ్యాపాలెం లోని ఇంటి బేస్ మెంట్ లో ఏకంగా ఒక ఆఫీసే తెరిచాడు. ఎసిబి అధికారులు జరిపిన దాడిలో 220 పట్టాదార్ పుస్తకాలు కూడ కనిపించాయి. రైతులొచ్చి లంచం ఇచ్చాకే వీటిని వాళ్లకి అందిస్తాడు.

 

1986 ఈ రెవిన్యూ ఉద్యోగంలో చేరాడు. 2011 డిప్యూటీ తాశీల్దార్ అయ్యాడు.తర్వాత 2015లో తాశీల్దార్ గా ఎదిగాడు.  ఇతగాడు హైటెక్ ను ఉపయోగించుకుని డబ్బులాగే వాడని ఎసిడబి అధికారులు చెప్పారు. రెవిన్యూ వెబ్ సైట్లో కి కూడా దూరి, నిజమయిన రైతులు మార్చి,  వాళ్ల ని గందరగోళంలోపడేసి, ఇదంతా సరిచేసేందుకు ఖర్చవుతుందని భారీ గా డబ్బు లు గుంజేవాడు. ఇదంతా ఈ బేస్ మెంట్ కార్యాలయం నుంచే జరిగేది.

 

ఇలాంటి ఘరానా నేరాలు  చాలా తక్కువగా జరగుతాయని  ఆయన అధికారులుచెబుతున్నారు.

 

 

click me!