చంద్రబాబుకు షాక్: అమరావతి భూముల స్కామ్ మీద ఏసీబీ కేసు

Published : Sep 15, 2020, 10:31 AM ISTUpdated : Sep 15, 2020, 10:46 AM IST
చంద్రబాబుకు షాక్: అమరావతి భూముల స్కామ్ మీద ఏసీబీ కేసు

సారాంశం

అమరావతి భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అమరావతి భూముల విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయడం సంచలనం కలిగిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి భూముల కుంభకోణం విషయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. అమరావతి భూముల కుంభకోణంపై విచారణకు అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) రంగంలోకి దిగింది.

అమరావతి భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ మీద ఏసీబీ పూర్తి స్థాయి విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతి భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ లో చంద్రబాబు పాత్రతో పాటు టీడీపీ నేతల పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఇద్దరు రెవెన్యూ అధికారులు దొరకడంతో అమరావతి భూమల కుంభకోణం విషయంలో ఏసీబీ రంగంలోకి దిగింది. ఇన్ సైడర్ ట్రేడింగుపై ఏసీబీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.

Also Read: అమరావతి భూ స్కామ్ కేసులో చంద్రబాబు పేరు: బొత్స సంచలనం

అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. బినామీల పేరు మీద భూములు కొనుగోలు చేశారనే ఆరోపణపై కొంత మందిని సీఐడి అధికారులు అరెస్టు కూడా చేశారు. అమరావతి భూముల కుంభకోణం కేసులో చంద్రబాబు పేరు కూడా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల అన్నారు. 

అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అమరావతి భూముల విషయంలో పెద్ద యెత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్పాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేసింది. 

Also Read: అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే: చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

సీట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేయడానికి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ పలువురిని విచారించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?