విశాఖ : ఏసీబీకి చిక్కిన వుడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. భారీగా వెలుగుచూసిన అక్రమాస్తులు

By Siva KodatiFirst Published Oct 26, 2022, 4:48 PM IST
Highlights

విశాఖలోని వుడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శోభన్ బాబు ఇంట్లో బుధవారం ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు , భవనాలు, బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు గుర్తించారు అధికారులు. రూ . 2 లక్షలకు పైగా నగదు, 230 గ్రాముల బంగారం, అర కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో ఏసీబీ చేతికి అవినీతి తిమంగలం చిక్కింది. వుడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శోభన్ బాబు ఇంట్లో బుధవారం ఏసీబీ తనిఖీలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి అతని నివాసంలో సోదాలు చేసింది. అచంట, భీమవరం, శ్రీకాకుళం, విజయనగరంలలో వున్న అతని బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు , భవనాలు, బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు గుర్తించారు అధికారులు. రూ . 2 లక్షలకు పైగా నగదు, 230 గ్రాముల బంగారం, అర కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. అరిలోవ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే మరింత బంగారం, నగదు , కీలక డాక్యుమెంట్లు బయటపడే అవకాశం వుందని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు. 

ఇకపోతే.. గత నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఇద్దరు వీఆర్ఓలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అనకాపల్లి జిల్లా ములగపూడి గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పాస్ పుస్తకాల కోసం రైతు నుండి రూ. 40 వేలు చెల్లించాలని రైతును వీఆర్ఓ డిమాండ్ చేశారు. అయితే రూ. 20 వేలు రైతు నుండి వీఆర్ఓ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గుంటూరు మేడికొండూరు మండలం వరగానిలో ఏసీబీ దాడులు జరిగాయి. రూ. 8 వేలు లంచం తీసుకొంటూ వీఆర్ఓ ఏసీబీకి పట్టుబడ్డాడు.
 

click me!