సీఎం జగన్‌ను కలవలేకపోయిన కోడికత్తి శీను కుటుంబ సభ్యులు.. వాళ్లు ఏం చెప్పారంటే..?

By Sumanth KanukulaFirst Published Oct 26, 2022, 4:08 PM IST
Highlights

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాలుగేళ్ల కిందట అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగిన సంఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో నిందితుడిగా ఉన్న శీను (కోడికత్తి శీను) అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాలుగేళ్ల కిందట అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగిన సంఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో నిందితుడిగా ఉన్న శీను (కోడికత్తి శీను) అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. అయితే తాజాగా సీఎం జగన్‌ను కలిసేందుకు కోడికత్తి శీను కుటుంబ సభ్యులు నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. అయితే వారు సీఎంను కలవలేకపోయారు. దీంతో వారు అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. శీను బెయిల్‌ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు. వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని.. తమై జాలి చూపించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 

సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన అనంతరం శీను కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను కలిసేందుకు తాము ఇక్కడికి వచ్చామని  చెప్పారు. శ్రీనుకు బెయిల్ ఇప్పించాలని సీఎం జగన్‌ను కోరాలని అనుకున్నామని తెలిపారు. అయితే సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం దొరకలేదని చెప్పారు. అయితే నెక్స్ట్ టైమ్ పిలిపిస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. రాష్ట్ర పరిధిలోకి కేసును తీసుకోని.. వీలైనంత తొందరగా శీనుకు బెయిల్ ఇప్పించాలని వేడుకుంటున్నట్టుగా చెప్పారు. ఇక, ఎదిగిన కొడుకు జైలులో మగ్గిపోతున్నాడని శీను తల్లి ఆవేదనవ్యక్తం చేశారు. 

Also Read: సీఎం క్యాంప్ కార్యాలయంలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు.. ఎందుకంటే..

శీను తరపు లాయర్ మాట్లాడుతూ.. ఈ కేసును ఎన్‌ఐఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడానికి హైకోర్టు జడ్జి, సీఎం‌కు మాత్రమే అధికారం ఉందని అన్నారు. శీనుది పేద దళిత కుటుంబమని.. వాళ్లకు లాయర్‌కు ఫీజు ఇచ్చే స్థోమత కూడా లేదన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏ నుంచి రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయాలని సీఎం జగన్ నుంచి నిరభ్యంతర పత్రం కోరాలని వచ్చామని తెలిపారు. సీఎం బిజీగా ఉండటంతో అధికారులు ఆర్జీ తీసుకున్నారని చెప్పారు. తర్వాత ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ ఎప్పుడో చెబుతామని అన్నారని తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి త్వరలోనే సీఎంను కలుస్తామనే అశాభావం వ్యక్తం చేశారు. శీను బెయిల్‌ కోసం సీఎం జగన్ ఎన్‌వోసీ ఇవ్వాలని.. లేకపోతే కేసును ఎన్‌ఐఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. 

బెయిల్ వచ్చినప్పటికీ.. వెంటనే రద్దు.. 
2018 అక్టోబర్ 25న సీఎం జగన్ తన పాదయాత్ర నుంచి కోర్టుకు హాజరుకావడం కోసం హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలోనే సీఎం జగన్‌పై శీను కోడికత్తితో దాడి జరిగింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా  తీవ్ర సంచలనం రేపింది. అయితే గాయంతోనే సీఎం జగన్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చి చికిత్స చేయించుకున్నారు. అయితే ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఇందుకు సంబంధించి వైసీపీ, టీడీపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. 

అయితే జగన్‌పై దాడి చేసిన శీను.. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసును ఎన్‌ఐఏ విచారిస్తుంది. ఈ కేసు విచారణలో ఉండగా మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చింది. అయితే విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దు అయింది. దీంతో శ్రీనివాస్‌ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

click me!