ఏపీలో ఏసీబీ దాడుల కలకలం.. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో కొనసాగుతున్న సోదాలు..

Published : Jun 23, 2023, 12:42 PM IST
ఏపీలో ఏసీబీ దాడుల కలకలం.. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో కొనసాగుతున్న సోదాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు  చేస్తున్నారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు  చేస్తున్నారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయులు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే ఒంగోలు, చీరాల, గుంటూరులోని ఆంజనేయులు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంజనేయులుపై ఫిర్యాదులు రావడంతోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్టుగా సమాచారం. 

మరోవైపు విశాఖలో సెబ్ సీఐ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా నగదు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యూమెంట్స్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, గతంలో శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?