ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులందరికీ అందాలి.. జగనన్న సురక్షను ప్రారంభించిన సీఎం జగన్..

Published : Jun 23, 2023, 12:15 PM IST
ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులందరికీ అందాలి.. జగనన్న సురక్షను ప్రారంభించిన సీఎం జగన్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు  కార్యాలయం నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు  కార్యాలయం నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. జగనన్న కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు మంచిచేసే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమని అన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి లబ్ది పొందని వారి కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం అని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులందరికీ అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అత్యంత పారదర్శకంగా, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. 

నవరత్నాల ద్వారా ఈ నాలుగేళ్లలో రూ. 2 లక్షల 16 వేల కోట్ల నిధులను నేరుగా బటన్ నొక్కి అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పౌర సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 600 రకాల పౌరసేవలను అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా పారదర్శకంగా పౌరసేవలు అందిస్తున్నామని తెలిపారు. 

రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం గతంలో ఉద్యమాలు జరిగేవని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి  పరిస్థితి లేదని అన్నారు. నాలుగేళ్లలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని  చెప్పారు. ఏపీలో అవినీతి రహిత పాలనే లక్ష్యమని చెప్పారు. 

ఇక, జగనన్న సురక్షలో భాగంగా ప్రతి సచివాలయంలో క్యాంప్ నిర్వహించేలా ఏర్పాటు చేశారు.  1902తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.  సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్తస్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు