చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

By narsimha lodeFirst Published Feb 6, 2020, 10:44 AM IST
Highlights

ఆదాయ పన్ను శాఖాధికారులు  గురువారం నాడు ఉదయం చంద్రబాబునాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 


అమరావతి: చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై  ఐటీ  అధికారులు గురువారం నాడు దాడులు నిర్వహించారు. చంద్రబాబునాయుడు వద్ద శ్రీనివాస్ సుధీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేశారు చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత శ్రీనివాస్ తన స్వంత డిపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్లారు.

Also read:టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడ శ్రీనివాస్ ఆయన వద్ద పీఏగా పనిచేశారు. 2014 నుండి 2019 ఎన్నికల వరకు శ్రీనివాస్ పీఏగా పనిచేశారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలైన తర్వాత  శ్రీనివాస్ తన స్వంత డిపార్ట్‌మెంట్ కు తిరిగి వెళ్లాడు. శ్రీనివాస్ సతీమణి కూడ ప్రభుత్వ ఉద్యోగి.చంద్రబాబునాయుడు సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాసు ఇంటిపై గురువారం నాడు ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం నెలకొంది. శ్రీనివాస్ ఇంట్లోనే త్వరలో శుభకార్యం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ తరుణంలో  ఈ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత నెలకొంది.

తొలుత శ్రీనివాస్  నివాలసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ప్రచారం సాగింది. అయితే ఏసీబీ అధికారులు ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.తాము ఎలాంలి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. 

ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారని తేలింది. గురువారం నాడు ఉదయమే టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం. 

click me!