మోకాళ్లపై కూర్చొని విద్యార్థులను వేడుకున్న ఉపాధ్యాయుడు

By telugu teamFirst Published Feb 6, 2020, 7:56 AM IST
Highlights

ఉపాధ్యాయుడు ఎస్‌.ఆనంద్‌ ఇలా రెండు చేతులు జోడించి మోకాళ్లపై కూర్చుని పిల్లలను మంగళవారం వేడుకున్నారు. రివిజన్‌ టెస్టులకు షాబుద్దీన్‌, కమలాకర్‌, కార్తీక్‌, అనీల్‌ శంకర్‌ హాజరుకాకపోవడంతో వారిని పిలిపించి పది పరీక్షల ప్రాముఖ్యాన్ని ఇలా వినూత్నంగా తెలిపారు.

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రివిజన్‌ టెస్టులకు గైర్హాజరు కావద్దంటూ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిన్నపొదిల్ల గ్రామం జడ్పీ పాఠశాల గణితం ఉపాధ్యాయుడు ఎస్‌.ఆనంద్‌ ఇలా రెండు చేతులు జోడించి మోకాళ్లపై కూర్చుని పిల్లలను మంగళవారం వేడుకున్నారు. రివిజన్‌ టెస్టులకు షాబుద్దీన్‌, కమలాకర్‌, కార్తీక్‌, అనీల్‌ శంకర్‌ హాజరుకాకపోవడంతో వారిని పిలిపించి పది పరీక్షల ప్రాముఖ్యాన్ని ఇలా వినూత్నంగా తెలిపారు.

Also Read ప్రేమ పెళ్లి... మెడలో కట్టిన తాళి ఎత్తుకెళ్లిన భర్త.. భార్య ఏంచేసిందంటే..

తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్రస్వామి గారు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంసుందరాచార్యులు,  ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షులు త్రినాథరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి ,  గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ చేసిన ఈ వినూత్న ఆలోచనను అభినందించారు. పిల్లలను గణితంలో ఉత్తీర్ణత పొందడానికి అందరు గణిత ఉపాధ్యాయలు చాలా కష్టపడుతున్నారని తెలిపారు.

click me!