విశాఖ కేంద్రంగా హానీట్రాప్: కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

By narsimha lodeFirst Published Jun 6, 2020, 10:33 PM IST
Highlights

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ఎన్ఐఏ మరో కీలక వ్యక్తిని శనివారం నాడు అరెస్ట్ చేసింది. నేవీకి చెందిన విశాఖపట్టణం గూఢచర్యం కేసులో ఉగ్రవాదులకి నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు అబ్దుల్ రహమాన్ జబ్బార్ షేక్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.


విశాఖపట్టణం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ఎన్ఐఏ మరో కీలక వ్యక్తిని శనివారం నాడు అరెస్ట్ చేసింది. నేవీకి చెందిన విశాఖపట్టణం గూఢచర్యం కేసులో ఉగ్రవాదులకి నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు అబ్దుల్ రహమాన్ జబ్బార్ షేక్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.ఇదే కేసులో అబ్దుల్‌ రెహమాన్‌ భార్య షయిత్సా కాజిర్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు

also read:వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

విశాఖ నౌకాదళం కేంద్రంగా ఈ హనీ ట్రాప్ వ్యవహరం సాగింది. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన ఈ విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి విశాఖ నేవీ అధికారులను ట్రాప్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది. నేవీకి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు కుట్ర పన్నినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

విశాఖ కేంద్రంగా సాగిన ఈ కుట్రను చేధించేందుకు ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆపరేషన్ డాల్ఫినోస్ పేరుతో దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఐసీపీ సెక్షన్ 120 బి, 121ఎ, యుపీ (ఏ) చట్టం సెక్షన్ 17,18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 క్రింద అధికారులు కేసు నమోదు చేశారు.

గత ఏడాది డిసెంబర్ లో 11 మంది నేవీ అధికారులతో పాటు 14 మందిని అరెస్ట్ చేశారు. కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ మెటీరీయల్ ను నిఘా వర్గాలు స్వాధీనం చేసుకొన్నాయి.

click me!