విశాఖలో మర్డర్,దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు: పోస్టు మార్టం రిపోర్టులో సంచలనం

Published : Jun 06, 2020, 07:45 PM IST
విశాఖలో మర్డర్,దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు: పోస్టు మార్టం రిపోర్టులో సంచలనం

సారాంశం

 రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్టుగా  వైద్యులు గుర్తించారు.


విశాఖపట్టణం: రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్టుగా  వైద్యులు గుర్తించారు.

విశాఖపట్టణం జిల్లాలోని అక్కయ్యపాలెం నందగిరి నగర్‌ కాలనీలో ఈ  నెల 3వ తేదీన  హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం నాడు కేజీహెచ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

also read:దివ్య ఫ్యామిలీలో ఆ మూడు హత్యలెలా జరిగాయి: వెలుగు చూస్తున్న సంచలనాలు

ఈ పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి.దివ్య కనుబొమ్మలను కత్తిరించారు. గుండు చేశారు. అంతేకాదు మూడు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో ఇంటి యజమానురాలు వసంతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

బుధవారం నాడు ఉదయం నాలుగు గంటల సమయంలో యువతి మృతదేహాన్ని మేడపై నుండి కిందకు దించారు. సంఘటన స్థలం నుండి మృతదేహాన్ని తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మృతదేహాన్ని తరలించేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హత్యకు గురైన దివ్యకు ఎవరూ లేరనే సాకును చూపుతూ త్వరగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించాలని నిందితులు ప్రయత్నించారని స్థానికులు చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా దివ్య.... వసంత ఇంట్లోనే ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి దివ్య పిన్నిని శనివారం నాడు పోలీసులు విశాఖపట్టణానికి రప్పించారు.

2015లో కూడ దివ్య తల్లి, అమ్మమ్మ, తమ్ముడు కూడ హత్యకు గురయ్యారు. ఈ హత్యలపై కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 3వ తేదీన ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు
అమిత్ షా తో చంద్రబాబు కీలక భేటి: CM Chandrababu Meets Amit Shah at Delhi | Asianet News Telugu