రైలుకు ఎదురెళ్లి తల్లీకూతుర్ల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన రైల్వే కీమాన్

By team teluguFirst Published Nov 28, 2022, 10:04 AM IST
Highlights

భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. రైల్వే ట్రాక్ పై ఆమె నిలబడి ఉండగా.. ఆ ప్రాంతంలో పని చేసే కీమాన్ ముగ్గురిని కాపాడారు. 

ఓ తల్లి, తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కదులుతున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఓ రైల్వే కీమాన్ వారిని చాకచక్యంగా కాపాడాడు. మూడు ప్రాణాలను రక్షించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో చోటుచేసుకుంది.

రోజురోజుకూ పెరుగుతున్న పదిహేనేళ్ల బాలిక పొట్ట.. అనుమానంతో తల్లిదండ్రులు నిలదీయగా....

పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనతో పాటు ఇద్దరు కూతుర్లను తీసుకొని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై ఆదివారం నిలబడింది. ఆ సమయంలో విజయవాడ-విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్ పై వస్తోంది.

కొడుకు ఎదుటే భర్తను తిడుతూ, కొడుతున్న భార్య.. తట్టుకోలేక ఆ భర్త చేసిన పని...

ఈ ముగ్గురు రైల్వే ట్రాక్ పై నిలబడి ఉండటాన్ని రైల్వే కీమాన్ వెంకటేశ్వరరావు గమనించారు. వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రాణాలను కాపాడాడు. ఇందులో మహిళ వయస్సు 27 సంవత్సరాలు కాగా.. ఓ చిన్నారి వయస్సు 7 సంవత్సరాలు. మరో చిన్నారి వయస్సు మూడు సంవత్సరాలు. ఈ విషయాన్ని కీమాన్ పిఠాపురం పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆమె ఆయనకు కౌన్సెలింగ్ చేసి రెస్క్యూ హోమ్‌కు తరలించారని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది.

అరకు ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ప్రైవేటు బస్సు...24 మంది ప్రయాణికులు సురక్షితం..

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

click me!