ప‌శువులు అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న లారీ బోల్తా.. 26 మూగ జీవాలు మృతి.. విజ‌య‌న‌గ‌రంలో ఘ‌ట‌న‌

By team teluguFirst Published Oct 3, 2022, 1:20 PM IST
Highlights

పశువుల అక్రమంగా రవాణా చేస్తున్న లారీ బోల్తా పడటంతో అందులో ఉన్న 27 మూగ జీవాలు చనిపోయాయి. మరి కొన్ని బయటకు వచ్చి పొలాల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన ఏపీలోని విజయనగరంలో చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిధిలోని గొర్లె సీతారామపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి 26 ఆవులు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న‌తో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రా ప్రాంతాల నుంచి హైదరాబాద్ తో పాటు దేశంలోని మ‌రి కొన్ని ప్రాంతాలకు ప‌శువులు అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న‌ట్టు మ‌రో సారి వెల్ల‌డైంది.

చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం.. కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు..

ప్ర‌మాదానికి గురైన లారీలో 47 పెద్ద ఆవుల‌ను లోడ్ చేసి ఆంధ్రా ఒడిశా సరిహద్దు (AOB) నుండి తెలంగాణకు త‌ర‌లించాల‌ని స్మ‌గ్ల‌ర్లు ప్లాన్ చేశారు. కానీ తుఫాను వ‌ల్ల ఏర్ప‌డిన గుంత‌లు, అధ్వాన్నమైన రోడ్ల కారణంగా ఆదివారం తెల్లవారు జామున ఆ వాహనం ఒక్క సారిగా బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో 26 పశువులు అక్క‌డిక్క‌డే మృతి చెందాయి. మిగిలిన పశువులు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లిపోయాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. 

ఇంద్రకీలాద్రిపై దర్శనాల రచ్చ : పోలీస్ ప్రోటోకాల్ వాహనాల్లో అధికారుల బంధువులు.. సామాన్యుల ఇక్కట్లు

ఈ లారీ రోడ్డుపై ప‌డిపోవ‌డం వ‌ల్ల గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వాహ‌నం డ్రైవ‌ర్, య‌జ‌మాని అక్క‌డి నుంచి పారిపోయాడు. లారీ య‌జ‌మానిని జి. కృష్ణగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

పశువుల అక్రమ ర‌వాణా వ్యాపారం ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోంది. దీనిని ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఒడిశా, కర్ణాటకకు చెందిన ముఠాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ ప్రాంతాలకు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో గొడ్డు మాంసం కొరతను స్మ‌గ్ల‌ర్లు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఈ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. 

click me!