జగనన్న విద్యా కానుక పేరుతో భారీ కుంభకోణం - జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ సంచలన ఆరోపణలు..

Published : Nov 14, 2023, 05:09 PM ISTUpdated : Nov 14, 2023, 05:13 PM IST
జగనన్న విద్యా కానుక పేరుతో భారీ కుంభకోణం - జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ సంచలన ఆరోపణలు..

సారాంశం

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న జగనన్న విద్యా కానుక పథకంలో అవకతవకలు జరిగాయని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకంలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అవినీతిపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి ఉన్న జనసేన పార్టీ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దళితులకు బీజేపీలో ఎదుగుదల ఉండదు - సొంత పార్టీపై కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

జగనన్న విద్యా కానుక  పథకంలో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. విద్యా కానుక పథకం కోసం 
మెటీరియల్ పంపిణీ చేసిన సంస్థలపై ఈడీ దాడి చేసిందని అన్నారు. ఈడీ చేసిన దాడుల్లో ఏపీలోనే దాని మూలాలు దొరికాయని తెలిపారు. ఆ సంస్థలపై ఈడీ ఇప్పటికీ విచారణ జరుపుతోందని చెప్పారు. 

ఇసుక రవాణాను అడ్డుకున్నాడని ఎస్ఐని గుద్ది చంపిన ట్రాక్టర్ డ్రైవర్.. మరో పోలీసుకు గాయాలు..

ఏపీలోని అధికారి వైసీపీ ప్రభుత్వం మొత్తంగా రూ. 1050 కోట్లతో విద్యా కానుకను మెటీరియల్ కోసం 5 కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అనంతరం ఆయా కంపెనీల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి కొల్లగొట్టారని ఆయన అన్నారు. విద్యా కానుకలతో కొన్న ఆర్డర్స్ కేవలం 5  కంపెనీలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

దోచుకోవడం ఎలాగో కాంగ్రెస్ చేతికి తెలుసు - ప్రధాని నరేంద్ర మోడీ

నాడు-నేడు పథకంలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రూ.6 వేల కోట్లు గ్రాంట్లు వచ్చాయని కానీ అందులో రూ.3,550 కోట్లే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. మిగిలిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్