ఏపీలో కొత్తగా 839 కేసులు.. చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ

Siva Kodati |  
Published : Jan 08, 2022, 05:22 PM ISTUpdated : Jan 08, 2022, 05:24 PM IST
ఏపీలో కొత్తగా 839 కేసులు.. చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 839 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,77,707కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 839 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,77,707కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,503కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 150 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,545కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,553 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,15,67,472కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,659 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 37, చిత్తూరు 175, తూర్పుగోదావరి 78, గుంటూరు 67, కడప 30, కృష్ణ 79, కర్నూలు 15, నెల్లూరు 61, ప్రకాశం 19, శ్రీకాకుళం 32, విశాఖపట్నం 174, విజయనగరం 37 పశ్చిమ గోదావరిలలో 35 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

భార‌త్ లోనూ  క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం మొద‌లైంది. కోవిడ్‌-19 పంజాతో ఏడు నెల‌ల రికార్డులు సైతం బ్రేక్ అయింది. ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. Covid-19 మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి  థ‌ర్డ్ వేవ్ భ‌యం ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌తి. గ‌త 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా  కొత్త‌గా 1,41,986 కేసులు నమోదయ్యాయి.  

ఇది ఏడు నెల‌ల గ‌రిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19  మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మ‌ళ్లీ  లక్ష మార్క్‌ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు  చేరువైంది.  

అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా  మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం క‌రోనా బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య 3,53,68,372కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఏకంగా నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా పెరిగాయి. ప్ర‌స్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

ఇదే స‌మ‌యంలో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి Covid-19 నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 3,44,12,740 కి చేరింది. కొత్త‌గా న‌మోదైన Coronavirus కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే 40,925 క‌రోనా కేసులు అక్క‌డ న‌మోద‌య్యాయి. అలాగే, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మ‌హారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 68,34,222 క‌రోనా కేసులు, 1,41,614 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే