రోమియోలా వెంటపడ్డా నిన్నెవరూ లవ్ చేయరు .. చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలపై విజయసాయి సెటైర్లు

Siva Kodati |  
Published : Jan 08, 2022, 03:00 PM IST
రోమియోలా వెంటపడ్డా నిన్నెవరూ లవ్ చేయరు .. చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలపై విజయసాయి సెటైర్లు

సారాంశం

సినీనటుడు పవన్ కల్యాణ్‌ (pawan kalyan) సారథ్యంలోని జనసేనతో పొత్తు గురించి ఇటీవల టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పొత్తు గురించి మాట్లాడుతూ లవ్ అనేది రెండు వైపులా ఉండాలని... వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

సినీనటుడు పవన్ కల్యాణ్‌ (pawan kalyan) సారథ్యంలోని జనసేనతో పొత్తు గురించి ఇటీవల టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పొత్తు గురించి మాట్లాడుతూ లవ్ అనేది రెండు వైపులా ఉండాలని... వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy) సెటైర్లు వేశారు.

రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని అన్నారు. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తరి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచి జనం లవ్ చేయరు బాబూ అని వ్యాఖ్యానించారు. నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలే అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

కుప్పం (kuppam) నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. పొత్తుల గురించి ఇప్పటికిప్పుడు ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కుప్పంలో తమ పార్టీ కార్యకర్త జనసేనతో పొత్తు గురించి సభలో చేసిన ప్రస్తావించగానే తాను వన్ సైడ్ లవ్ గురించి వ్యాఖ్యానించానని చంద్రబాబు మీడియాకు చెప్పారు. పొత్తులపై రెండు వైపుల సమ్మతం ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని తాను నిన్న సభలో చెప్పానన్నారు.

పొత్తుల గురించి వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతున్నారన్నారు. తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న సమయంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అదే సమయంలో పొత్తులున్న సమయంలో కూడా అధికారాన్ని కోల్పోయామని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తే  రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఒక్క అవకాశమే చివరి అవకాశంగా వైసీపీకి మారనుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై ఇటీవల కాలంలో మరోసారి చర్చ తెరమీదికి వచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అహ్మద్ షరీఫ్ ఇటీవల ప్రకటించారు. బీజేపీతో జనసేన మధ్య పొత్తు ఉంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది.  బీజేపీకి జనసేన దూరమైందా  అనే చర్చ కూడా సాగింది. అయితే రెండు పార్టీల మైత్రి ఉందని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఇటీవల లేవు. దీంతో టీడీపీకి జనసేన దగ్గర అవుతుందనే ప్రచారం కూడా సాగింది. 

జనసేనతో పాటు లెఫ్ట్ పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసే అవకాశం ఉందని  టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఆయా పార్టీల నుండి స్పష్టత రావాల్సి ఉంది. సీపీఐ మాత్రం ప్రస్తుతం టీడీపీతో కలిసి పనిచేస్తోంది. కొన్ని ఆందోళన కార్యక్రమాల్లో సీపీఐ నేతలు టీడీపీతో కలిసి పనిచేస్తోంది. కానీ సీపీఎం మాత్రం స్వతంత్రంగా కార్యక్రమాలు చేపట్టింది.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఉంటాయని చెబుతూనే రాష్ట్ర  అవసరాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు కోరారు.అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇతర పార్టీలతో పొత్తులుంటాయనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే ఏ పార్టీలు టీడీపీతో కలిసి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!