కొత్తగా 478 మందికి పాజిటివ్: ఏపీలో 8,76,814కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Dec 16, 2020, 6:43 PM IST
Highlights

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పెడుతున్నాయి. గత 24 గంటల్లో (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) కొత్తగా ఏపీలో 478 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పెడుతున్నాయి. గత 24 గంటల్లో (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) కొత్తగా ఏపీలో 478 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ రోజు నమోదయిన కేసులతో రాష్ట్రంలో 8,76,814కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 7,067కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 4,420 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి ఇప్పటి వరకు 8,65,327 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా విశాఖలో ఇద్దరు, కడపలో ఒకరు కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 715 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు.

మొత్తంగా..రాష్ట్రంలో 1,10,01,476 శాంపిల్స్ పరీక్షించారు. అనంతపురం 30, చిత్తూరు 89, ఈస్ట్ గోదావరి 58, గుంటూరు 48. కడప 19, కృష్ణా  62, కర్నూలు 06, నెల్లూరు 17, ప్రకాశం 12, శ్రీకాకుళం 13, విశాఖపట్టణం  44, విజయనగరం 17, వెస్ట్ గోదావరిలలో 63 మంది కోవిడ్ బారినపడ్డారు.

మరోవైపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేయించుకునేవారిలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఆరోగ్య సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఉంటారని తెలిపారు.

వీరందరూ లక్షల్లో ఉంటారని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొద టి విడత వ్యాక్సినేషన్‌ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి మళ్లీ 4 వారాల తర్వాత రెండోసారి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

click me!