తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్‌లు : ఏపీకి అరూప్ గోస్వామి, టీఎస్‌కి హిమా కోహ్లీ

By Siva KodatiFirst Published Dec 16, 2020, 5:20 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. తెలంగాణ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపింది

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. తెలంగాణ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపింది.

వీరి స్థానంలో  తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ హిమా కోహ్లీని, ఏపీ హైకోర్టుకు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని నియమించాలని నిర్ణయించారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ 2019 జూన్ 23 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు ఆయన రెండో ప్రధాన న్యాయమూర్తి.

ఇప్పుడు జస్టిస్ హిమా కోహ్లీని నియమిస్తే అమె మూడో ప్రధాన న్యాయమూర్తి అవుతారు. జస్టిస్ హిమా కోహ్లీ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో వున్నారు. 

click me!