ఏలూరు వింత వ్యాధి: జగన్ చేతికి నివేదిక.. కారణం ఇదే

By Siva KodatiFirst Published Dec 16, 2020, 5:56 PM IST
Highlights

ఏలూరు వింత వ్యాధిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. పురుగు మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని నివేదిక తేల్చింది. ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి

ఏలూరు వింత వ్యాధిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. పురుగు మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని నివేదిక తేల్చింది. ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి.

అయితే అవి మనుషుల శరీరాల్లో ఎలా ప్రవేశించాయనే దానిపై నిపుణులు మరింత అధ్యయనం జరపనున్నారు. ఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఈ నివేదికపై స్పందించిన సీఎం జగన్.. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని సూచించారు. 

ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలను పరిశీలించాలని, అవసరం అయితే, ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దాని ఫలితాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

ఏలూరు లాంటి ఘటనలు మరోచోట జరగకూడదన్నారు. మరోవైపు ఆర్బీకేల ద్వారా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని జగన్ సూచించారు.

click me!