విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఐదుగురు అర్చకులు కూడ కోవిడ్ కి చికిత్స తీసుకొంటున్నారు.
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఐదుగురు అర్చకులు కూడ కోవిడ్ కి చికిత్స తీసుకొంటున్నారు.దుర్గగుడిలో పనిచేసే సిబ్బందిలో 43 మందికి కరోనా సోకింది. వీరిలో 20 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. మిగిలినవారంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ ఆలయంలో పనిచేసే ఐదుగురు అర్చకులకు కూడా కరోనా సోకింది. వారు కూడ చికిత్స తీసుకొంటున్నారు.
అర్చకులు, సిబ్బందికి కరోనా సోకడంతో ఇంద్రకీలాద్రి ఆలయంలో అధికారులు శానిటైజేషన్ చేపట్టారు. ఏపీ రాష్ట్రంలో కూడ రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ విషయమై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీ సభ్యులు ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి తెప్పించుకోవాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఫరార్మా కంపెనీలతో సీఎం జగన్ శుక్రవారం నాడు ఫోన్లో మాట్లాడారు.