విజయవాడ రాహుల్ హత్య కేసు: మరో నలుగురిని అరెస్ట్.. కోరాడ, కోగంటి సంస్థలు సీజ్

By Siva KodatiFirst Published Aug 29, 2021, 5:06 PM IST
Highlights

రాహుల్ కరణం హత్య కేసులో విజయవాడ పోలీసులు మరో నలుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. వీరిని శ్రీనాథ్, బాబూరావు, రాజాబాబు, రమేశ్‌లుగా తెలిపారు. అలాగే కోరాడ, కోగంటిలకు చెందిన రెండు వ్యాపార సంస్థలను పోలీసులు సీజ్ చేశారు.

విజయవాడలో యువ వ్యాపారవేత్త రాహుల్ కరణం హత్య కేసులో పోలీసులు ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 నిందితుల్లో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా శ్రీనాథ్, బాబూరావు, రాజాబాబు, రమేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అలాగే కోరాడ, కోగంటిలకు చెందిన రెండు వ్యాపార సంస్థలను పోలీసులు సీజ్ చేశారు. ఈ రెండు సంస్థల ప్రాంగణంలోనే రాహుల్‌పై వీరు దాడి చేశారు. అరెస్ట్ అనంతరం నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 

కాగా, వ్యాపార లావాదేవీలే జిక్సిన్ సిలిండర్ల వ్యాపారి కరణం రాహుల్ హత్యకు కారణమని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. జిక్సిన్ సిలిండర్ల ఫ్యాక్టరీ ఎండీ కరణం రాహుల్ హత్య కేసులో  ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో తన కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.   కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న రాహుల్ ను వెనుక నుండి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తో చంపారని  సీపీ చెప్పారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.

Also Read:వ్యాపార లావాదేవీలే కరణం రాహుల్ హత్యకు కారణం: విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు

ఫ్యాక్టరీ విషయమై కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు వబేధాలొచ్చాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు.  రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మంది ఉన్నారని సీపీ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కేసులో ఇంకా కొందరి అనుమానితుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. 

పార్మింగ్ చేసిన ప్రాంతంలోనే కారులోనే రాహుల్ ను నిందితులు హత్య చేశారని సీపీ చెప్పారు.  రాహుల్ ను కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ లు బెదిరించారని  తమ దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు.  రాహుల్ ను బెదిరించి  కొన్ని డాక్యమెంట్లపై కూడా సంతకాలు తీసుకొన్నారని సీపీ చెప్పారు.
 

click me!