ఏపీ రాజధానిగా విశాఖపట్టణం: పార్లమెంట్‌కు సమర్పించిన డాక్యుమెంట్‌లో కేంద్రం

By narsimha lodeFirst Published Aug 29, 2021, 4:35 PM IST
Highlights

విశాఖపట్టణం ఏపీ రాష్ట్రానికి రాజధానిగా ఉందని పార్లమెంట్‌కు సమర్పించిన డాక్యుమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. పెట్రోలియం శాఖ మంత్రి పార్లమెంట్ కు సమర్పించిన  డాక్యుమెంట్‌లో ప్రకటించింది.ఈ వషయమై అమరావతి జేఎసీ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం పదే పదే  రాజధాని విషయంలో తప్పులు చేస్తోందని విమర్శిస్తున్నారు.


విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన  డాక్యుమెంట్‌లో విశాఖ పట్టణాన్ని  రాజధానిగా పేర్కొంది.  పెట్రోల్ ధరలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమాధానం ఇచ్చింది.ఈ సమాధానంలో  రాష్ట్రాల రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖపట్టణాన్ని చేర్చింది.

ఈ ఏడాది జూలై 26వ తేదీన పెట్రోల్ ధరల పెంపు విషయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.ఈ సమాధానంలో ఏపీ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్టణాన్ని చేర్చారు.గతంలో  ఏపీ రాజధాని అంశం  న్యాయపరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల పెంపు అంశంపై అంచనాకు సంబంధించిన డాక్ముమెంట్‌లో ఏపీ రాజధానిని విశాఖగా  కేంద్రం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.  అమరావతిలో శాసనరాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.ఈ విషయమై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో కేసులు వేశారు.  ఈ పిటిషన్లపై విచారణను నవంబర్ 15వ తేదీకి వాయిదా పడింది.  కోర్టు అనుమతితోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను  విశాఖకు తరలిస్తామని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే  ఈ ప్రకటన వెలుగు చూసింది.

అయితే ఈ విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ వివరణ ఇచ్చిందని సమాచారం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల విషయంలో కూడ ఇదే రకమైన పొరపాట్లు చేశారని సమాచారం. ఆయా రాష్ట్రాల ప్రధాన నగరాల స్థానంలో డాక్యుమెంట్లో కేపిటల్ అనే పదం చేర్చామని పెట్రోలియం శాఖ అధికారులు మౌఖికంగా వివరణ ఇచ్చారని సమాచారం.

click me!