నిప్పుపై 3 క్రిమినల్ కేసులా ?

Published : Feb 13, 2018, 11:33 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
నిప్పుపై 3 క్రిమినల్ కేసులా ?

సారాంశం

చంద్రబాబునాయుడుపై మూడు కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబునాయుడు మీద మూడు క్రిమినిల్ కేసులున్నాయా? అవుననే అంటున్నాయ్ అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్(ఏడిఆర్), ఎలక్షన్ వాచయ అనే సంస్ధలు.  దేశంలోని ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల సమాచారం సేకరణ మీద పై సంస్ధలు పెద్ద కసరత్తే చేసాయి. సంస్ధల తాజా వివరాల ప్రకారం దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి 11 మందిపై క్రిమినిల్ కేసులున్నాయి. వారిలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై అత్యధికంగా 22 కేసులున్నాయి. బీహార్ సిఎం నితీష్ కుమార్ పై ఒక్క కేసు నమోదైంది

ఇక, చంద్రబాబునాయుడుపై మూడు కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసులేవి అన్న వివరాలు మాత్రం ఏడిఆర్ వెల్లడించలేదు. కాకపోతే చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ‘ఓటుకునోటు’ కేసు విషయం అందరికీ తెలిసిందే.  మిగిలిన రెండు కేసులు ఏవి అన్న విషయంలో స్పష్టత లేదు. తాను నిప్పులాంటి వాడనని తరచూ చెప్పుకునే చంద్రబాబుపైన కూడా మూడు క్రిమినల్ కేసులున్నాయంటే నిప్పుకు చెదలు పట్టటమంటే బహుశా ఇదేనేమో.

PREV
click me!

Recommended Stories

అంజనమ్మకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక .. ఏ కొడుకూ తల్లికి ఇలాంటి భర్త్ డే గిఫ్ట్ ఇచ్చుండడు
RK Roja Comments: పవన్ పై రోజా సెటైర్లు | Deputy CM Pawan Kalyan | Asianet News Telugu