చంద్రబాబే అత్యంత ధనిక సిఎం

Published : Feb 13, 2018, 11:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
చంద్రబాబే అత్యంత ధనిక సిఎం

సారాంశం

ప్రతీ ఏడాది ఆస్తులను ప్రకటించే నారా లోకేష్ లెక్కలకు పై లెక్కల కు ఎక్కడా పొంతన లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో అత్యంత ధనవంతుడైన సిఎం అని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆయన ఆస్తుల విలువ రూ.177 కోట్లని (చంద్రబాబు ఆస్తులు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు కలిపి) పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ (రూ.129 కోట్లు), పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ (రూ.48 కోట్లు) ఉన్నట్లు వెల్లడించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఆ సంస్థ వెల్లడించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా ఆయా ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ ఆస్తులను పేర్కొన్నాయి. అత్యధిక ఆస్తులున్నవారి జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగోస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.15.51 కోట్లున్నట్లు (కేసీఆర్‌ ఆస్తులు, ఆయన సతీమణి శోభ ఆస్తులు కలిపి) వెల్లడయింది. వీరిద్దరి చరాస్తులు రూ.6,50,82,464 కాగా, స్థిరాస్తుల విలువ రూ.8,65,00,000.

ఇక, అతితక్కువ ఆస్తులన్నవారి జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ ఉన్నారు. ఆయన ఆస్తల మొత్తం విలువ రూ.26 లక్షలు మాత్రమే. తర్వాత స్థానంలో మమతాబెనర్జీ (రూ.30లక్షలు), మెహబూబా ముఫ్తీ (రూ.55 లక్షలు) నిలిచారు. ఇందులో మాణిక్‌సర్కార్‌ పాన్‌ నెంబర్‌ ఇవ్వలేదు. రూ.వందకోట్లకుపైగా ఆస్తులున్న ముఖ్యమంత్రులు ఇద్దరు, రూ.10-50 కోట్ల మధ్య ఉన్నవారు ఆరుగురు, రూ.1-10 కోట్ల మధ్య ఉన్నవారు 17 మంది, రూ. కోటిలోపు ఉన్నవారు ఆరుగురు ఉన్నట్లు ఏడీఆర్‌ తేల్చింది. దేశంలోని 31 ముఖ్యమంత్రి పీఠాల్లో ముగ్గురు మహిళలు (10%), ఉంటే 28 మంది పురుషులు (90%) ఉన్నారు.

సరే, ఈ విషయాలను పక్కన బెడితే ప్రతీ ఏడాది ఆస్తులను ప్రకటించే నారా లోకేష్ లెక్కలకు పై లెక్కల కు ఎక్కడా పొంతన లేదు. లోకేష్ తన తండ్రి చంద్రబాబు ఆస్తులను చాలా తక్కువగా చూపిస్తుంటారు. సరే, లోకేష్ ప్రకటించే ఆస్తుల వివరాలను ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదనుకోండి. అయినా దేశం మొత్తం మీద తామె నిప్పంటూ చెప్పుకునే లోకేష్ తాజాగా ఏడిఆర్ ప్రకటించే లెక్కలకు ఏమని సమాధానం చెబుతారో ?

 

PREV
click me!

Recommended Stories

Minister Srinivas Varma Speech at Amarajeevi Jaladhara Scheme Foundation Stone | Asianet News Telugu
Pawan Kalyan Powerful Speech: అమరజీవి జలధార పథకం శంకుస్థాపన | Jaladhara Scheme | Asianet News Telugu