సీఎం జగన్ ప్రకటనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడులు వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ శాసన సభలో సీఎం వైయస్ జగన్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు మాజీడిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయోచ్చు అంటూ జగన్ ప్రకటించడం శుభపరిణామమన్నారు. తాను మెుదటి నుంచి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు గుర్తు చేశారు.
undefined
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం శాసన సభలో రాజధానిపై చర్చలో కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉండొచ్చు అంటూ బాంబు పేల్చారు. అంతేకాదు త్వరలోనే కమిటీ తన నివేదికను అందజేస్తుందని దానిపై క్లారిటీ కూడా వస్తుందని ప్రకటించారు.
జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు..
జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ కరువు, మీకంటే మేమే బెటర్: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు..
ఇకపోతే సీఎం జగన్ ప్రకటనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడులు వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు.
తాము పరిపాలన వికేంద్రీకరణకు అంగీకరించబోమని, అభివృద్ధి వికేంద్రీకరణకు మాత్రం సహకరిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. జగన్ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడతారే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు విమర్శించారు.
గంటాకు వరంగా జగన్ నిర్ణయం: సీఎం పై ప్రశంసలు అందుకేనా.....
ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు అయితే జగన్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును గంటా స్వాగతిస్తే, కర్నూలులో హైకోర్టు ఏర్పాటును కేఈ స్వాగతిస్తున్నారు.
ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల అంశంపై గుర్రుగా ఉన్నారు. మూడు రాజధానుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ చెప్పుకొచ్చారు. తాము పరిపాలన వికేంద్రీకరణకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు పవన్ కళ్యాణ్.
తిండి లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకొచ్చి: మూడు రాజధానులపై పవన్ స్పందన...
ఆయన తాకట్టుపెడితే మీరు ఏకంగా అమ్మేస్తున్నారు: జగన్ ప్రకటనపై కన్నా ఫైర్...