జగన్ నిర్ణయాలు గానీ ప్రకటనలు గానీ చూస్తుంటే ఆయన అనుభవరాహిత్యం, ఆత్రుత కనిపిస్తోందన్నారు. జగన్ నిర్ణయాలు రాష్ట్రానికి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. పరిపాలన వికేంద్రీకరణ సాధ్యం కాదని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సూచించారు.
సచివాలయం ఒకచోట, హెచ్ఓడీలు మరోచోట, హైకోర్టు వేరే చోట ఇది సాధ్యం కాదన్నారు. మూడు మూడు ప్రాంతాల్లో ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాధ్యమంటూ నిలదీశారు. జగన్ నిర్ణయం గందరగోళమే తప్ప మరేమీ కనిపించడం లేదని విమర్శించారు.
undefined
రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీడ్ క్యాపిటల్ మారిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి స్వర్గం చూపిస్తానన్న జగన్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు...
జగన్ నిర్ణయాలు గానీ ప్రకటనలు గానీ చూస్తుంటే ఆయన అనుభవరాహిత్యం, ఆత్రుత కనిపిస్తోందన్నారు. జగన్ నిర్ణయాలు రాష్ట్రానికి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
ఇకపోతే చంద్రబాబు నాయుడుకి జగన్ కి తేడా ఏమీ పెద్దగా కనిపించడం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఇష్టానుసారం డబ్బులు తగలేశారని ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రజల ఆస్తులు చంద్రబాబు తాకట్టు పెడితే ఏకంగా జగన్ అమ్మేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఆప్షన్‌గా పెట్టమని బీజేపీ తరపున తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో ఏపీకి ప్రయోజనం లేదని కన్నా పేర్కొన్నారు.
ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్...
6 నెలల్లో అధికార యంత్రాంగంపై జగన్ పట్టు కోల్పోయారని విమర్శించారు. జగన్ నియంతృత్వాన్ని సొంతపార్టీ ఎంపీలు, నేతలు సైతం తప్పుబడుతున్నారంటూ విమర్శించారు. ఇకపోతే సీఎం జగన్ కు హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు.
తాము ఢిల్లీ వెళ్లినప్పుడే అమిత్ షా ను కలవాలి అనుకోవడం సరికాదని ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు. పోలవరం, విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం మాటను సైతం జగన్ పెడచెవిన పెట్టారని విమర్శించారు. తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తామన్న ధోరణిలో జగన్ వెళ్తున్నారని దాని వల్ల నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ది ఆత్రమే తప్ప... పనితీరు లేదు: మూడు రాజధానులపై కన్నా వ్యాఖ్యలు...